రాజ్‌తరుణ్ 'తిరగబడరా సామి' టీజర్.. ఎలా ఉందంటే..
అమాయకంగా ఉండే ఓ కుర్రాడు తనకు ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్ దారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనే థీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మొదట్లో అందుకున్న విజయాలను ఇప్పుడు అందుకోలేక సతమతమవుతున్నాడు. సకెస్స్ను అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. ఒక్క హిట్టు కొట్టి మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ మనోడి లక్కు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతోనైనా సక్సెస్‌ను అందుకోవడానికి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
అదే 'తిరగబడరా సామి'. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్నీ అండ్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేశారు.
అమాయకంగా ఉండే ఓ కుర్రాడు తనకు ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్ దారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనే థీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఇందులో హీరో రాజ్‌తరుణ్ ఓ పిరికివాడుగా కనిపించగా హీరోయిన్ను మాస్‌గా చూపించారు. అలాగే వీరిద్దరినీ బాలయ్య బాబు అభిమానులుగానూ చూపించారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, ఫన్ అన్ని సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మల్వీ మల్హోత్రా ఎంతో అందంగా అలాగే మాస్ అప్పీయరెన్స్లోనూ బాగుంది. హీరో రాజ్‌తరుణ్ ఇనోసెంట్‌గా పిరికావాడులా కనిపిస్తూనే.. చివర్లో ఫైటింగ్ పవర్‌ఫుల్‌గా చేశాడు. హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసిన తప్పులేదు హీరోయిన్ డైలాగ్ చెప్పడం హైలైట్‌గా ఉంది. ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్ రోల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. 'ఇది నా సామాజ్ర్యం అందరూ గంజాయి వనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటాను. అది ఇప్పుడు కనపడట్లేదు. ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. చివరికి ట్రైలర్‌ను జై బాలయ్య స్లోగాన్స్తో ముగించారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ కూడా బాగా ఉన్నాయి. మొత్తంగా ఓ వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని మూవీటీమ్ చెబుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకి జె.బి సంగీతం, ఎం.ఎన్.జవహర్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు.