టైగర్ నాగేశ్వరరావు... ఇండియన్ సినీ చరిత్రలో మొదటి సారి
మొదటి సారి టైగర్ నాగేశ్వరరావు ను అలాంటి సైన్ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యం లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' దసరా కానుకగా అక్టోబర్ 20వ తారీకున పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ట్రైలర్ ని విడుదల చేసి అంచనాలు అమాంతం పెంచేశారు. రవితేజ గత సినిమాలతో పోల్చితే ఇది అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తూ ఉంటే అనిపిస్తుందని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.
దానికి మంచి స్పందన రావడంతో సినిమాను కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేయాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్ణయించుకున్నారట. ఇది చాలా పెద్ద సాహస నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగం జరగలేదు. మొదటి సారి టైగర్ నాగేశ్వరరావు ను అలాంటి సైన్ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యం లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది. కనుక ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.
ఈ సినిమాలో రవితేజ పాత్ర ఇండియన్ సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేయడం కన్ఫర్మ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించడం తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు కూడా ఉండటం వల్ల సినిమా స్టార్ కాస్ట్ పరంగా భారీగా పెరిగింది.
విడుదలకు ముందే విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు కి పోటీగా బాలయ్య 'భగవంత్ కేసరి' మరియు విజయ్ 'లియో' సినిమాలు బాక్సాఫీస్ వద్ద కు రాబోతున్నాయి. మరి వాటితో టైగర్ పోరాటం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.