శ్రీవిష్ణు హీరోయిన్.. వ్వాటే స్టన్నింగ్ లుక్

సామజవరగమన సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా నటించిన మలయాళీ ముద్దుగుమ్మ రెబా మౌనికా జాన్.

Update: 2024-09-05 03:56 GMT

సామజవరగమన సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా నటించిన మలయాళీ ముద్దుగుమ్మ రెబా మౌనికా జాన్. ఈ బ్యూటీ 2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే మలయాళీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి రెగ్యులర్ గా మూవీస్ చేసుకుంటూ వస్తోంది. జరుగండి సినిమాలో జైకి జోడీగా నటించి తమిళంలో రెబా మౌనికా జాన్ అడుగుపెట్టింది. దళపతి విజయ్ బిగిల్ మూవీలో కూడా కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ రెబాకి మంచి పేరు తీసుకొచ్చింది.


గత ఏడాది సామజవరగమన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రెబా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మలయాళీ, తమిళ్ భాషలలో ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక తమిళ్, ఒక మలయాళీ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రేజ్ లో కాకపోయిన రెబా మౌనిక జాన్ అయితే అవకాశాలు బాగానే అందుకుంటుంది.

ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లిన, ఏం చేసిన ఇన్ స్టాగ్రామ్ లో వాటిని పంచుకోవడం అందాల భామలకి అలవాటు. రెబా మౌనిక జాన్ కూడా తన ప్రతి మూమెంట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే తన ఫీలింగ్స్ కి కూడా స్టోరీస్ గా పెడుతూ ఉంటారు.

తాజాగా రెబా మౌనిక జాన్ ఒక కాటేజ్ లో దిగిన గ్లామరస్ పిక్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్చేసింది. ఈ ఫొటోలో స్టైలిష్ గా నిలబడి వెనుక ఉన్న లేక్ ని రెబా మౌనిక చూస్తోంది. ఈ పిక్స్ లో రెబా అందం అందరిని కట్టిపడేసేలా ఉంది. ఈ ఫోటోకి ఆమె ఇంటరెస్టింగ్ కొటేషన్ కూడా జోడించింది. మన ప్రయాణం ప్రేమలాగే ఉంటే ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తాం. తెలివిగా ఆలోచిస్తూ ప్రయాణంలో ప్రతి అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాం.

మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే బెస్ట్ జర్నీస్, అలాగే బెస్ట్ లవ్ అనేది ఎప్పటికి ముగిసిపోవు అని పికో అయ్యర్ రాసిన కొటేషన్ ని పోస్ట్ చేసింది. ఈ కొటేషన్ రెబా మౌనికా జాన్ ఫీలింగ్ ని తెలియజేస్తోంది. ప్రస్తుతం ట్రిప్ లో ఉన్న ఆమె ప్రయాణాన్ని ఆస్వాదిస్తోందనే విషయాన్ని రిప్రజెంట్ చేస్తోంది.

Tags:    

Similar News