టాలీవుడ్ ఏప్రిల్.. బోణీ పడుతుందా..

ప్రతి వారం.. ప్రతి నెలా.. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామనే. అందులో కొన్ని మంచి విజయాలను అందుకుంటాయి.;

Update: 2025-04-15 12:30 GMT
Tollywood Awaits Its First April Hit

ప్రతి వారం.. ప్రతి నెలా.. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామనే. అందులో కొన్ని మంచి విజయాలను అందుకుంటాయి. ఇంకొన్ని అనుకోని రీతిలో రానిస్తాయి. మరికొన్ని హిట్ అవుతాయనుకుంటే ఫ్లాప్స్ గా మారుతుంటాయి. అలా ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కానీ ఒక్క మూవీ కూడా విజయం అందుకోలేదు. చెప్పాలంటే ఏప్రిల్ మంత్ సగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా టాలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. గత వారం స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన జాక్.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ప్రేక్షకులను మెప్పిస్తుందనుకుంటే తీవ్రంగా నిరాశపరిచింది.

అయితే ఈ వారం.. రెండు పెద్ద సినిమాలతోపాటు ఒక సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పుడు వాటి లో ఏ మూవీ.. ఏప్రిల్ లో ఫస్ట్ హిట్ గా నిలుస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఓదెల 2, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలు రిలీజ్ కానున్నాయి. రవితేజ నా ఆటోగ్రాఫ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న ఓదెల-2 మూవీ ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది.. ఓదెల 2కు రైటర్ గా, నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మైథలాజికల్ హారర్ జోనర్ లో వస్తున్న ఆ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా 18వ తేదీనే విడుదల కానుంది. సీనియర్ నటి విజయశాంతి సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

మదర్ సెంటిమెంట్ కూడా ఉన్న ఆ మూవీ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. మరోవైపు, మాస్ మహారాజా రవితేజ కెరీర్‌ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన నా ఆటోగ్రాఫ్ ఏప్రిల్ 18న రీ రిలీజ్ కానుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరిచిన సౌండ్‌ ట్రాక్ మూవీకి మెయిన్ హైలెట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి ఈ మూడు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News