2025 బాక్సాఫీస్.. డేంజర్ బెల్?

ఈ ఏడాది గట్టిగా చూసుకుంటే టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ‘గుంటూరు కారం’, ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’ సినిమాలు ఈ 10 నెలల్లో పెద్ద మూవీస్ గా థియేటర్స్ లోకి వచ్చాయి.

Update: 2024-10-14 05:35 GMT

ఈ ఏడాది గట్టిగా చూసుకుంటే టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ‘గుంటూరు కారం’, ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’ సినిమాలు ఈ 10 నెలల్లో పెద్ద మూవీస్ గా థియేటర్స్ లోకి వచ్చాయి. ‘గుంటూరు కారం’ ఫలితం ఏంటనేది అందరికి తెలిసిందే. మిగిలిన రెండు సినిమాలు ఎగ్జిబిటర్లుకి ఎంతో కొంత రాబడి తీసుకొచ్చాయి. నెక్స్ట్ రాబోయే సినిమాల జాబితా చూసుకుంటే స్ట్రాంగ్ గా ఎక్కువ రోజులు థియేటర్స్ ని హోల్డ్ చేయగలిగే సత్తా ఒక్క పుష్ప 2కి మాత్రమే ఉంది. ఆ మూవీ డిసెంబర్ 6న థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ ఏడాది వస్తాయన్న పెద్ద సినిమాలు అన్ని వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అవన్నీ కూడా మొదటి నాలుగు, ఐదు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుండటం విశేషం. సంక్రాంతి రేసులో ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఏప్రిల్ 10 ‘ది రాజాసాబ్’ రేసులో ఉంది. ‘విశ్వంభర’ మూవీ కూడా ఏప్రిల్ లోనే కన్ఫర్మ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు బాలయ్య మూవీ కూడా సంక్రాంతి కి రిలీజ్ కాబోతోంది.

అలాగే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ మార్చి 28న కన్ఫర్మ్ చేశారు. ‘ఓజీ’ కూడా అటు ఇటుగా ఏప్రిల్, మే నెలల్లోనే రావొచ్చని అనుకుంటున్నారు. అంటే టైర్ 1లో ఉన్న హీరోలందరి సినిమాలు ఆల్ మోస్ట్ మే నాటికి థియేటర్స్ లోకి వచ్చేస్తాయి. మే తర్వాత నెక్స్ట్ 7 నెలలు టైర్ 1 హీరోల సినిమాలు లేవు. దీంతో థియేటర్స్ లో సందడి చెప్పుకోదగ్గ విధంగా ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో 2400 థియేటర్స్ ఉంటే వాటిలో 1600 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. మిగిలిన థియేటర్స్ పెద్ద సినిమాలు రిలీజ్ అయినపుడు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. మంచి సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్స్ ద్వారా ఆదాయం వస్తుందనుకుంటే కొనసాగించే ఆలోచనలో ఎగ్జిబిటర్లు కూడా ఉన్నారు. నష్టాలతో ఉద్యోగుల జీతాలు ఇచ్చుకొని నడపలేని పరిస్థితి ఉంది. ఈ ఏడాదిలోనే ఎగ్జిబిటర్లకి తెలుగు సినిమాల వలన చెప్పుకోదగ్గ సంతోషం లేదు.

వచ్చే ఏడాది ఈ పరిస్థితి మరింత దిగజారిపోతుందనే మాట వినిపిస్తోంది.పెద్ద హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీస్ చేసుకుంటూ ఏడాదికి ఒక్క సినిమా కూడా కరెక్ట్ గా రిలీజ్ చేయడం లేదు. రెండు, మూడేళ్ళకి ఒక సినిమాతో వస్తున్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువ కాలం ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించలేకపోతున్నాయి. డిజిటల్ యాప్స్ ప్రభావం కూడా గణనీయంగా థియేటర్స్ ఆడియన్స్ తగ్గడానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది క్లోజ్ అయ్యే థియేటర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నడుపుకోవడం భారం అవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత, హీరోలు, నిర్మాతలే తీసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.

Tags:    

Similar News