టాలీవుడ్ నిర్మాతలు ఆయనపై గురి పెట్టారా?
ట్యాలెంట్ ఎక్కడ ఉంటే? అక్కడకెళ్లి ఒప్పించి తీసుకురావడంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. అందులోనూ ఈ మధ్య కాలంలో దిల్ రాజు ముందుంటున్నారు.;

ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ నిర్మాతలిప్పుడు చాలా మారారు. ఒకప్పుడు అవకాశం ఇవ్వా లంటే ఎన్నో లెక్కలేసేవారు. ఇప్పుడా లెక్కలకు భిన్నంగా ప్రతిభగల వారికి అవకాశాలివ్వడంలో ముందుంటున్నారు. కంటెంట్ ఎంపికలోనూ షార్ప్ గా ఉంటున్నారు. మూస కథలను రిజెక్ట్ చేసి ఇన్నోవేటివ్ కథలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ ఐదారేళ్ల కాలంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

అందుకే టాలీవుడ్ సక్సెస్ రేట్ కూడా మెరుగు పడింది. సరైన కంటెంట్ ఉంటే ఇమేజ్ తో పనిలేకుండా సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ప్రతిభావంతులు బయటకు వచ్చారు. అగ్రగామి నిర్మాణ సంస్థలు సైతం అంతే షార్ప్ గా ఉంటున్నాయి. ట్యాలెంట్ ఎక్కడ ఉంటే? అక్కడకెళ్లి ఒప్పించి తీసుకురావడంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. అందులోనూ ఈ మధ్య కాలంలో దిల్ రాజు ముందుంటున్నారు.
శంకర్ తో సినిమా తీయాలన్నది తన కల. ఆ కలను గేమ్ ఛేంజర్ తో సాధించుకున్నాడు. హిట్ అయిందా? ఫట్ అయిందా? అన్నది తర్వాత సంగతి తన డ్రీమ్ ని పుల్ ఫిల్ చేసుకున్నాడు. అలాగే 'మార్కో' ఫేం హనీఫ్ ఆదేనీ తోనూ ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రాజుగారు దృష్టి తమిళ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పై కూడా పడ్డట్లు వినిపిస్తుంది.
ఇటీవలే ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా నటించిన ఈ గ్యాగ్ స్టర్ స్టోరీ మంచి విజయం సాధించింది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తెలుగు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అధిక్ కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్. దిల్ రాజుతో పాటు మరికొంత మంది నిర్మాతలు కూడా అధిక్ కి టచ్ లో కి వెళ్లినట్లు సమాచారం. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ని లాక్ చేస్తే ఎప్పుడైనా స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది.