స్టార్ హీరోలంతా న్యూ ఇయర్ లో ప్రెష్ గా ఇలా!
స్టార్ హీరోలంతా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. విదేశాలకు వెళ్లాల్సిన వారంతా ఇప్పటికే ఆయా దేశాలకు చేరుకున్నారు
స్టార్ హీరోలంతా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. విదేశాలకు వెళ్లాల్సిన వారంతా ఇప్పటికే ఆయా దేశాలకు చేరుకున్నారు. హైదరాబాద్ లో ప్లాన్ చేసుకున్న వారంతా ఇక్కడే ఉన్నారు. పాత ఏడాదికి బైబై చెప్పి గ్రాండ్ గా కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సర్వం సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అలాగని ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోలేదు.
దాదాపు షూటింగ్ లన్నీ తిరిగి మళ్లీ జనవరి మొదటి వారంలోనే రీలాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `రాజాసాబ్`,` ఫౌజీ` చిత్రాల షూటింగ్ జనవరి 3న మళ్లీ మొదల వుతుంది. `రాజాసాబ్` దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో డార్లింగ్ ఫోకస్ అంతా `ఫౌజీ` షూటింగ్ పైనే ఉంది. అలాగే బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అంఖండ తాంవడం` కూడా బ్రేక్ పడింది.
ఈ సినిమా షూటింగ్ కూడా బోయపాటి శ్రీను తిరిగి 3వ తేదీకే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే మాస్ రాజా రవితేజ నటిస్తోన్న `మాస్ జాతార`, నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న `హిట్ -3` కూడా జనవరి 3న రీలాంచ్ అవుతాయని తెలిసింది. ఈ సినిమాల కొత్త షెడ్యూల్స్ తో మళ్లీ సెట్స్ కి వెళ్తాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` షూటింగ్ కి ముందే బ్రేక్ పడింది. కొత్త షెడ్యూల్ ని జనవరి 20 తర్వాత మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇంకా చాలా సినిమాల షూటింగ్ లు జనవరి మొదటి వారంలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `హరిహర వీరమల్లు`, `ఓజీ` కూడా అదే బాటలో పయనిస్తున్నాయని సమాచారం. ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం అప్ డేట్ కొత్త ఏడాది రోజైనా వస్తుందా? అన్నది చూడాలి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాని సంగతి తెలిసిందే.