మ‌నోళ్లు క‌థ కంటే బ‌డ్జెట్ పైనే ఫోక‌స్ పెడుతున్నారా?

మీడియం రేంజ్ హీరోలు కూడా పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.;

Update: 2025-04-02 06:14 GMT
మ‌నోళ్లు క‌థ కంటే బ‌డ్జెట్ పైనే ఫోక‌స్ పెడుతున్నారా?

మీడియం రేంజ్ హీరోలు కూడా పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మ‌రి వీళ్ల‌లో ఫాంలో ఉంది ఎవ‌రు? అంటే నేచుర‌ల్ స్టార్ నాని ఒక్క‌డే క‌నిపిస్తున్నాడు. క‌థా బలం ఉన్న సినిమాలు చేసుకుంటూ స‌క్సెస్ లు అందుకుంటున్నాడు. రెండు..మూడేళ్ల‌గా నాని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాలు సాధిస్తున్నాయి.

ఇటీవ‌లే `తండేల్` తో నాగ‌చైత‌న్య కూడా భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. వీరిద్ద‌రు త‌ప్ప మిగ‌తా హీరోలు చాలా మంది ఫాం కోల్పోయారు. నితిన్, క‌ల్యాణ్ రామ్, శ‌ర్వానంద్, వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, గోపీ చంద్, అఖిల్, వైష్ణ‌వ్ తేజ్, రామ్ వీళ్లంతా స‌క్సెస్ రుచి చూసి చాలా కాల‌మ‌వుతుంది. చేసిన ప్ర‌య‌త్నా లేవి ఫ‌లించ‌డం లేదు. నితీన్ రీసెంట్ రిలీజ్ `రాబిన్ హుడ్` తో బౌన్స్ బ్యాక్ అవుతానుకున్నారంతా.

ఈ సినిమాపై నితిన్ కూడా చాలా న‌మ్మకం పెట్టుకున్నాడు. కానీ రొటీన్ కంటెంట్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. వ‌రుణ్ తేజ్ గ‌త చిత్రం మ‌ట్కా పాన్ ఇండియాలో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితం ఊహించ‌ని విధంగా వ‌చ్చింది. ర‌వితేజ సినిమాలు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌డం త‌ప్ప బాక్సాఫీస్ వ‌ద్ద సాధించేది క‌నిపించ‌డం లేదు. అకిల్, రామ్, వైష్ణ‌వ్ తేజ్, శ‌ర్వా అంతా ఇదే దారిలో ఉన్నా రు. అయితే వీళ్ల గ‌త సినిమాల‌న్నీ కూడా భారీ బ‌డ్జెట్ లే.

మార్కెట్ రేంజ్ ని మించే ఖ‌ర్చు చేసారు. దీంతో ఇప్పుడీ హీరోలపై మార్కెట్ లో నెగిటివిటీ మొద‌లైంది. హీరోలంతా క‌థ‌ల కంటే బ‌డ్జెట్ పై దృష్టి పెడుతున్నారు? త‌ప్ప స్క్రిప్ట్ ఎంపిక‌ల్లో క్లారిటీ లోపించిన త‌నం క‌నిపిస్తుందంటున్నారు. బ‌ల‌మైన కంటెంట్ ని చూజ్ చేసుకోవ‌డంలో వెనుక‌బ‌డుతున్నార‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఈ నెగిటివిటీని ఎలా అధిగ‌మిస్తారు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News