ఆ సినిమా కూడా రెండు ముక్క‌లవుతోందా?

తామెందుకు రెండు భాగాలు గా తీయ‌కూడ‌దు? అన్న ఆలోచ‌న‌తో ముందుకెళ్తున్నారు. ఈనేప‌థ్యంలో `కేజీఎఫ్` రెండు భాగాలైంది.

Update: 2024-09-23 10:30 GMT

సినిమా ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కులు సినిమాలు చూసే విధానంతో పాటు, మేక‌ర్స్ లో మేకింగ్ విధాంన‌లోనూ స‌మూల మార్పులు చోటుచేసుకున్నాయి. `బాహుబ‌లి` అందుకు ఆజ్యం పోసింది. ఆ సినిమాని రెండు భాగాలుగా తీసిన త‌ర్వాత మేక‌ర్స్ లో ప‌రివ‌ర్త‌న మొద‌లైంది. తామెందుకు రెండు భాగాలు గా తీయ‌కూడ‌దు? అన్న ఆలోచ‌న‌తో ముందుకెళ్తున్నారు. ఈనేప‌థ్యంలో `కేజీఎఫ్` రెండు భాగాలైంది.

ఇప్ప‌టికే `క‌ల్కి 2898` మొద‌టి భాగంగా రిలీజ్ అవ్వ‌గా..రెండ‌వ భాగం రెడీ అవుతోంది. అటు `దేవ‌ర‌` కూడా రెండు భాగాల‌ని ముందే ప్ర‌క‌టించారు. మొద‌టి భాగం వ‌చ్చే వారం రిలీజ్ అవుతుంది. అలాగే `స‌లార్ సీజ్ ఫైర్` ఇప్ప‌టికే రిలీజ్ అయింది. రెండ‌వ భాగం కూడా వ‌చ్చేఏడాది మొద‌ల‌వుతుంది. ఇటీవ‌లే `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఇది సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆ ర‌కంగా ప్లాన్ చేసారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ 12వ చిత్రం కూడా రెండు భాగాల‌వుతున్న‌ట్లు స‌మాచారం. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజ‌య్ స్పై పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమా ఆద్యంతం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఉంటుందం టున్నారు.

ఈ క‌థ‌ని ఒక్క భాగంగా చెప్ప‌డం వీలు ప‌డ‌ద‌ని రెండు భాగాలు చేస్తే బాగుంటుంది అనే కోణంలో మేక‌ర్స్ విడ‌గొడుతున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ద‌స‌రాకి రివీల్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అదే రోజు రెండు భాగాల విష‌యాన్ని అధికారికంగా చెబుతార‌నే వార్త లొస్తున్నాయి.

Tags:    

Similar News