బాలయ్య కోసం టాలీవుడ్ ప్లాన్ .. ఎప్పుడంటే?
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయనకు పద్మభూషణ్ అవార్డు వరించడం ప్రత్యేకమని చెప్పాలి. దీంతో బాలయ్య అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రావడంతో, దశాబ్దాలుగా కంటున్న కల నిజమవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నటుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడంతో సెలబ్రేషన్స్ ను గ్రాండ్ చేసుకుని సందడి చేస్తున్నారు.
అదే సమయంలో బాలయ్యకు అనేక మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ తెలిపారు. అది ఆయన సేవలకు నిదర్శమని కొనియాడారు. ఆ తర్వాత రోజు మరికొందరు సెలబ్రిటీలు బాలయ్య ఇంటికి వెళ్లి మరీ ఆయనకు బొకేస్ ఇచ్చి విషెస్ తెలిపారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ తరఫున బాలయ్యకు భారీ సన్మానం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సన్మాన సభకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో తేదీతో పాటు వేదికను ఖరారు చేయనున్నారని వినికిడి.
అయితే బాలయ్య.. సినీ ఇండస్ట్రీలో స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నందుకు నోవాలెట్ ఆడిటోరియంలో టాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్ గా ఈవెంట్ ను ఇప్పటికే నిర్వహించారు. ఆ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డి, రాఘవేంద్రరావు, మురళీమోహన్ సహా అనేక మంది హాజరయ్యారు.
ఇప్పుడు మరోసారి పద్మ భూషణుడు బాలయ్యకు ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా అనేక మంది ప్రముఖులు రానున్నట్లు సమాచారం. తాతమ్మ కల మూవీతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ.. బాలనటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు. ఆ తర్వాత హీరోగా అనేక విజయాలు అందుకున్నారు. రీసెంట్ గా డాకు మహారాజ్ తో మెప్పించారు. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అఖండ-2 మూవీతో బిజీ అవ్వనున్నారు. ఇంతలో పద్మభూషణ్ వరించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు!