టాలీవుడ్ లో శివుని నేప‌థ్యంలో వ‌స్తోన్న సినిమాలివే!

అందులో మొద‌టిగా చెప్పుకోవాల్సింది అఖండ‌2. బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ‌కు సీక్వెల్ గా తెర‌కెక్కుతుంది.

Update: 2025-02-26 07:01 GMT

ఈ మ‌ధ్య పురాణాలు, దైవత్వానికి సంబంధించిన క‌థా నేప‌థ్యంలో ఎక్కువ‌గా సినిమాలొస్తున్నాయి. ఫుల్ లెంగ్త్ డివోష‌నల్ ఫిల్మ్ కాక‌పోయినా సినిమాలో క‌థ మేర డివోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చి ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఈ క‌థా నేప‌థ్యంలో ప‌లు సినిమాలు సెట్స్ పై ఉండ‌గా, శివునితో లింక్ అయిన సినిమాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

అందులో మొద‌టిగా చెప్పుకోవాల్సింది అఖండ‌2. బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ‌కు సీక్వెల్ గా తెర‌కెక్కుతుంది. అఖండ‌2లో శివునికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉండ‌గా, బాల‌య్య ఈ మూవీలో అఘోరాగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ర‌మ శివ భక్తుడైన క‌న్న‌ప్ప క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా క‌న్న‌ప్ప‌. ఈ సినిమాలో శివుడు గా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ కీల‌క పాత్ర‌లో నటించ‌నున్న ఈ మూవీలో మోహ‌న్‌లాల్, కాజ‌ల్, మోహ‌న్‌బాబు కూడా ప‌లు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఏప్రిల్ 25న క‌న్న‌ప్ప ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఓదెల2 కూడా శివుని నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతుంది. ఓదెల రైల్వేస్టేష‌న్ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా అఘోరిగా క‌నిపించ‌నుంది. నాగ సాధువు పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ రీసెంట్ గానే మ‌హా కుంభ‌మేళాలో రిలీజ్ చేశారు.

వీటితో పాటూ సుధీర్ బాబు హీరోగా వెంక‌ట్ క‌ళ్యాణ్ తెర‌కెక్కిస్తున్న జ‌టాధ‌ర సినిమాలో కూడా శివుని నేప‌థ్యంలో సాగే సీన్స్ ఉండ‌నున్నాయంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమాలో సాయి శ్రీనివాస్ అఘోరగా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ అక్టోబ‌ర్ లో రిలీజ్ కానుంది. అర‌వింద్ కృష్ణ, ఆషు రెడ్డి, జ్యోతి పూర్వ‌జ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సుక్కు పూర్వ‌జ్ తెరకెక్కిస్తున్న ఏ మాస్ట‌ర్ పీస్ క‌థ కూడా శివుని నేప‌థ్యంలోనే ఉండ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమాలే కాకుండా శివునికి సంబంధించి ఎన్నో పాట‌లు కూడా ఈ సినిమాల్లో ఉండ‌నున్నాయి.

Tags:    

Similar News