దుబాయ్‌లో పెళ్లికి ఫ్యామిలీతో ఎన్టీఆర్.. ఇంతకీ ఎవరి పెళ్లి?
ఈ పెళ్లి కోసమే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి దుబాయ్ వెళ్లగా, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లారు.
ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్ కోసం టాలీవుడ్ లోని స్టార్లంతా అక్కడికి చేరుకుంటున్నారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ కూడా ఈ పెళ్లి కోసం దుబాయ్ కు చేరుకుంటున్నారు. అయితే అంతమంది ప్రముఖులు వెళ్లేంతగా దుబాయ్ లో జరుగుతున్నది ఎవరి పెళ్లి అనుకోవచ్చు.
అసలు విషయానికొస్తే, టాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించిన AMR గ్రూప్ ఛైర్మన్, A. మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి దుబాయ్ లో జరుగుతుంది. ఈ పెళ్లి కోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు దుబాయ్‌కు చెక్కేస్తున్నారు. మహేష్ రెడ్డి భక్తి చిత్రాలైన షిర్డీ సాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలను నిర్మించాడు.
దుబాయ్ లో అంగరంగ వైభవంగా, ఎంతో గ్రాండ్ గా ఈ పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లగా, మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవనున్నారని సమాచారం.
ఈ పెళ్లి కోసమే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి దుబాయ్ వెళ్లగా, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లారు. ఇందులో భాగంగానే నమ్రత, ఎన్టీఆర్, ప్రణతి కలిసి ఓ గ్యాంగ్ తో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం వార్2 ను ముగించే పనిలో ఉన్న తారక్, తన తర్వాతి సినిమాను నీల్ తో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. నెక్ట్స్ షెడ్యూల్ నుంచి తారక్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరోవైపు మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటంతో పాటూ మహేష్ పాస్‌పోర్ట్ ను రాజమౌళి సీజ్ చేయడం వల్ల ఈ పెళ్లికి హాజరవడం లేదని అర్థమవుతుంది.