టాలీవుడ్ దీపావళి.. అప్డేట్స్ సౌండ్ గట్టిగానే

ఈ దీపావళికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకి రావడం లేదు.

Update: 2024-10-16 05:07 GMT

ఈ దీపావళికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకి రావడం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ‘లక్కీ భాస్కర్’ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులకి కాస్తా హోప్స్ ఉన్నాయి. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘క’ అనే సైన్స్ ఫిక్షన్ అండ్ పీరియాడికల్ థ్రిల్లర్ జోనర్ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా కంప్లీట్ అయ్యింది.

‘లక్కీ భాస్కర్’ కి పోటీగా వస్తోన్న ఈ సినిమాని మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. నిజానికి స్టార్ హీరోల సినిమాలేవీ దీపావళి రేసులో రిలీజ్ కాకపోవడంతో టాలీవుడ్ లో ఫెస్టివల్ పై అంత హైప్ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఆ టైంలో చాలా సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ అప్డేట్స్ అన్ని కూడా పెద్ద సినిమాల నుంచి వస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ బజ్ నడవబోతోంది.

దీపావళికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అలాగే నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘NBK109’ మూవీ టైటిల్ కమ్ టీజర్ రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల కోసం ఆయా హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో రెడీ అవుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ కూడా రిలీజ్ కానుందంట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సింగిల్ ని దీపావళికి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. వీటితో పాటు ‘పుష్ప 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి రాబోతోందంట. అలాగే నాగ చైతన్య పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నితిన్ రాబిన్ హుడ్ మూవీ అప్డేట్ కూడా ఆ రోజు రానున్నట్లు సమాచారం.

ఇలా కొత్త సినిమాల అప్డేట్స్ తో దీపావళి మంచి ఎగ్జైటింగ్ గా మారబోతోందని తెలుస్తోంది. ఎగ్జైట్ చేసే సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం కొంత డిజపాయింట్ చేసే అంశం అయిన ఫ్యాన్స్ కి కావాల్సిన టపాసుల సౌండ్ సినిమాల అప్డేట్స్ ద్వారా రాబోతుండటం ఒకింత సంతృప్తికరం అని చెప్పాలి. మరి దీపావళికి రాబోయే సినిమాల అప్డేట్స్ లో ఏది ఎక్కువగా పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News