బ్లాక్ లో మెరిసి పోతున్న చిన్నారి పెళ్లి కూతురు
హిందీ సీరియల్స్ ద్వారా బాల నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన అవికా గోర్ ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తోంది.
హిందీ సీరియల్స్ ద్వారా బాల నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన అవికా గోర్ ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. హిందీ సీరియల్స్ ను తెలుగు లో డబ్ చేయడం ద్వారా అవికా గోర్ చాలా సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ముఖ్యంగా బాలిక వధు సీరియల్ ను చిన్నారి పెళ్లి కూతురు గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఆ సీరియల్ ద్వారానే అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఆ క్రేజ్ కారణంగానే ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ద్వారా అవికా గోర్ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే అవికా కొన్ని తప్పుడు ఎంపికల వల్ల నష్ట పోయింది. వరుసగా హిట్స్ పడుతున్న సమయంలో అనూహ్యంగా ఈమె తీసుకున్న నిర్ణయం విమర్శల పాలు అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేయకుంటే బాగుండు అని తాను కూడా స్వయంగా అనుకుని ఉంటుంది. ఆ సినిమాల వల్ల ఆఫర్లు తగ్గి పోయాయి అనే వారు కూడా లేక పోలేదు. అందుకే ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.
కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా, బరువు ఎక్కువగా కనిపించిన అవికా గోర్ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఈమె కొత్త లుక్ చూసి చాలా మంది సర్ప్రైజ్ అవుతున్నారు. సన్నబడ్డ తర్వాత మరింత అందంగా అవికా కనిపిస్తోందని నెటిజన్స్ తో పాటు మీడియా సర్కిల్స్ లోనూ ప్రచారం జరుగుతోంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అయినప్పటికీ దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు, రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో మెరిసి పోతుంది. నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ ను డిజైన్ చేసిన డిజైనర్ కి కృతజ్ఞతలు చెబుతూ ఈ ఫోటోలతో పాటు కామెంట్ చేసింది. అవికా గోర్ ప్రస్తుతానికి ఒక తెలుగు సినిమా తో పాటు మరో రెండు ఇతర భాషల సినిమాల్లో నటిస్తోందని తెలుస్తోంది. వాటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు అవికా ఇదే అందం తో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.