పూజా హెగ్డే.. పొట్టి నిక్కరులో అలా..
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘ముకుంద’తో తెలుగులో అడుగుపెట్టిన పూజా, దువ్వాడ జగన్నాథం,’ అల వైకుంఠపురములో’ వంటి సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంది. కానీ ఇటీవల కాలంలో ఆమె కెరీర్ లో బిగ్ హిట్స్ ఏమి పడలేదు.
ముఖ్యంగా బాలీవుడ్ వైపు అడుగులు వేసినప్పటికీ, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ వంటి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. తెలుగు చిత్రసీమలో కూడా రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పూజా కెరీర్ కు సడన్ బ్రేక్ పడినట్లయింది. అయితే ఈ విధమైన పరిస్థితులను పూజా హెగ్డే పట్టించుకోకుండా, తన కెరీర్ ని తిరిగి సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం పూజా తన స్టైలిష్ లుక్స్‌తో ఎప్పటికప్పుడు చర్చల్లో నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ కొత్త ఫోటోషూట్లను షేర్ చేస్తూ, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తన స్టన్నింగ్ లుక్స్‌తో ట్రెండింగ్‌లో ఉండడమే కాకుండా, డిఫరెంట్ ఫ్యాషన్ ఛాయిస్లతోనూ కొత్త యాంగిల్స్ లో కనిపిస్తోంది.
తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న నిక్కరులో అలా ఫారెస్ట్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నార్త్ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ లుక్‌లో పూజా ఇచ్చిన పోజులు అభిమానుల మనసును దోచేశాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే, పూజా ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఒక సినిమా చేయనుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కెరీర్ కి మళ్లీ కొత్త వెలుగులు నింపుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో కలిసి చేస్తున్న సినిమా కూడా పూజా కెరీర్ కు మరో యూ టర్న్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా పూజా తిరిగి స్టార్ హీరోయిన్గా తిరిగి నిలబడేందుకు ఎంతగానో సహాయపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.