టాలీవుడ్ లో పోటెత్తిన భ‌క్తి నేప‌థ్యం!

టాలీవుడ్ లో భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. ఈ త‌ర‌హా బ్యాక్ డ్రాప్ కంటెంట్ సినిమా పుట్టిన తొలి రోజుల్లోనే మొద‌లైంది.

Update: 2024-08-21 05:47 GMT

టాలీవుడ్ లో భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. ఈ త‌ర‌హా బ్యాక్ డ్రాప్ కంటెంట్ సినిమా పుట్టిన తొలి రోజుల్లోనే మొద‌లైంది. అప్ప‌టి నుంచి నేటి జ‌న‌రేష‌న్ హీరోలు కూడా ఏదో రూపంలో భ‌క్తి నేప‌థ్యంతో కూడిన సినిమాలు చేస్తూనే ఉన్నారు. సౌత్ ఇండ‌స్ట్రీ లో భ‌క్తి నేప‌థ్యం సినిమాలు ఎక్కువ‌గా తెలుగు నుంచే రిలీజ్ అవుతుంటాయి. అందులోనూ శివుడి బ్యాక్ డ్రాప్ సినిమాలంటే మ‌రింత క్రేజ్.

ఇప్పుడు అప్ డేట్ వెర్ష‌న్ లో రిలీజ్ అవుతున్నాయి. ఓసారి ఆ సినిమా విశేషాల్లోకి వెళ్తే మంచు విష్ణు `క‌న్న‌ప్ప` చిత్రాన్ని పాన్ ఇండియాలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసింది. ఇది పూర్తిగా శివుడి బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.

ఇక మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `ఓదెల‌-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా నుదిటిన విబూతి పెట్టి, ఢ‌మ‌ర‌కం చేత‌ప‌ట్టిన స్టిల్స్ నెట్టింట వైర‌ల్ గానూ మారాయి. ఇందులో అమె శివ‌భ‌క్తురాలి పాత్ర పోషిస్తుంది. సంపత్ నంది అందించిన క‌థ‌తో అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. అలాగే సుధీర్ బాబు హీరోగా `జ‌టాధ‌ర` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇది కూడా శివుడి క‌థే.

అలాగే అర‌వింద్ కృష్ణ‌, జ్యోతి పూర్వ‌జ్, అషురెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా `ఏ మాస్ట‌ర్ పీస్` తెర‌కెక్కుతోంది. ఇది శివుడి నేప‌థ్యంతోనే తెర‌కెక్కిస్తున్నారు. బాల‌కృష్ణ క‌థ‌నాయ‌కుడిగా న‌టించ‌నున్న `అఖండ‌-2` కూడా భ‌క్తి నేప‌త్యంతో కూడుకున్న చిత్ర‌మేన‌ని తెలుస్తోంది. తొలి భాగం `అఖండ` శివ‌భ‌క్తి కాన్సెప్ట్ ఆధారంగానే రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభ‌ర` సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్. ఇది కూడా భ‌క్తిభావంతో నిండిన సినిమా అనే తెలుస్తోంది. అలాగే అనసూయ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న `అరి`..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించ‌నున్న` హైంద‌వ్` కూడా భ‌క్తి నేప‌థ్యంతో ముడిప‌డిన చిత్రాలే.

Tags:    

Similar News