.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

రాజమౌళి మహాభారతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ..?

కల్కిలో మహాభారతం ఎపిసోడ్ కేవలం 20 నిమిషాల పాటే ఉన్నా థియేటర్ లో ఉన్న ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి.

Update: 2024-06-30 06:55 GMT

నాగ్ అశ్విన్ తీసిన కల్కి సినిమా మహాభారతం టచ్ చేసి వదిలాడు. ఐతే కొన్నాళ్లుగా మహాభారతం తీయాలని రాజమౌళి చెబుతున్నాడు. తన డ్రీం ప్రాజెక్ట్ అదని కూడా అన్నాడు. బాహుబలి టైం లో మహాభారతం తెరకెక్కించాలని ఉందని ఐతే దానికి మరో పదేళ్లు టైం పడుతుందని అన్నాడు. ఐతే పదేళ్లకు అటు ఇటుగా అదే మహాభారతం టచ్ చేస్తూ నాగ్ అశ్విన్ కల్కి సినిమా చేశాడు. కల్కిలో మహాభారతం ఎపిసోడ్ కేవలం 20 నిమిషాల పాటే ఉన్నా థియేటర్ లో ఉన్న ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి.

ఇక రాజమౌళి మొత్తం మహాభారతం చేస్తే మాత్రం పీక్స్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఐతే రాజమౌళి మహాభారతం లో కాస్టింగ్ పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉంటుంది. అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడు ఇలా భారతం లోని ప్రధాన పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి మహాభారతం లో తెలుగు స్టార్ హీరోలంతా కూడా నటించే అవకాశం లేకపోలేదు. అంతేకాదు సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు కూడా ఈ సినిమాలో నటించే ఛాన్సులు ఉన్నాయి.

Read more!

నాగ్ అశ్విన్ కల్కిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు గెస్ట్ రోల్స్ చేశారు. అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. రాజమౌళి మహాభారతం తీస్తే మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజమౌళి కాబట్టి ప్రతి హీరో తమ పాత్ర వరకు ఆయన బెస్ట్ గా చూపించే అవకాశం ఉంటుందని ఒప్పుకుంటాడు.

టాలీవుడ్ మొత్తం కలిసి రాజమౌళి డైరెక్షన్ లో మహాభారతం తీస్తే మాత్రం సినిమా రికార్డుల గురించి కొన్నేళ్లుగా చెప్పుకునేలా అవుట్ పుట్ ఉంటుంది. తెలుగు తెర మీద ఇప్పుడు కాదు బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే పౌరాణిక సినిమాలు వచ్చాయి. మళ్లీ టాలీవుడ్ అలాంటి కథలవైపు అడుగులు వేస్తుంది. సో ఇది ఒకరకంగా మంచిదే అని చెప్పొచ్చు. రాజమౌళి మహాభారతం లో ఎవరెవరు ఏయే పాత్రల్లో నటిస్తే బాగుంటుందో ఇప్పటికే చాలా రకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మరి రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి. ఎప్పుడొచ్చినా రాజమౌళి మహాభారతం అంటూ తీస్తే మాత్రం నెవర్ బిఫోర్ అనిపించేలా అద్భుతాన్ని సృష్టిస్తాడని ఆడియన్స్ బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News