రణబీర్ పై ఫోకస్ పెంచిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్
తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోబోతున్న బాలీవుడ్ హీరోగా రణబీర్ కపూర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో కేవలం హిందీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం కనిపిస్తోంది. ట్రైలర్ కు ముందు ఒక లెక్క, ట్రైలర్ తర్వాత మరొక లెక్క అనే విధంగా ఈ సినిమా క్రేజ్ పెంచుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోబోతున్న బాలీవుడ్ హీరోగా రణబీర్ కపూర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత అతనికి ఇక్కడ కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతని తదుపరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తిగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యానిమల్ సినిమా బజ్ చూసిన తర్వాత చాలామంది టాలీవుడ్ నిర్మాతలు కూడా అతనిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది..
అయితే అందరికంటే ముందుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. యానిమల్ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఆయనే సొంతం చేసుకున్నారు. ఇక రణబీర్ కపూర్ అడగ్గానే తప్పకుండా దిల్ రాజుతో సినిమా చేస్తాను అని కూడా చెప్పాడట. అయితే రణబీర్ ను స్క్రిప్ట్ తో ఒప్పించడం అంటే సాధారణమైన విషయం కాదు.
అతని ఆలోచన విధానం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక దిల్ రాజు ప్రస్తుతమైతే ఒక ముగ్గురు దర్శకులకు రణబీర్ కోసం మంచి కథలో ఉంటే రెడీ చేయమని కూడా చెప్పారట. ఇక ఆ కథలు గనక అతని ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటే మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఏమాత్రం నచ్చకపోయినా కూడా అతను చేయలేను అని మొహం మీదే చెప్పేస్తాడు కూడా.
కాబట్టి దిల్ రాజు మంచి టాలెంటెడ్ దర్శకులతో కథలను సిద్ధం చేయించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అనిమల్ సినిమా రిలీజ్ తర్వాత రణబీర్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఇక ఆ తర్వాత దిల్ రాజుతో చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఎప్పటినుంచో దిల్ రాజు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా మంచి మార్కెట్తో పట్టు సాధించాలని అనుకుంటున్నారు. మరి రణబీర్ కపూర్ ద్వారా ఆయనకు ఆ ఛాన్స్ వస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.