టాప్ 10 గ్రాస్.. దేవర పరిస్థితేంటి?
సుమారు 350 నుంచి 400 కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగింది. థీయాట్రికల్ బిజినెస్ చూసుకుంటే 200-250 కోట్ల మధ్యలో ఉండబోతోందని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఐదు ఇండియన్ భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. త్వరలో మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ సినిమా థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే దేవర సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. సుమారు 350 నుంచి 400 కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగింది. థీయాట్రికల్ బిజినెస్ చూసుకుంటే 200-250 కోట్ల మధ్యలో ఉండబోతోందని తెలుస్తోంది. సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ రావాడం గ్యారెంటీ. అయితే సినిమా సక్సెస్ రేంజ్ ని డిసైడ్ చేసేది మౌత్ టాక్ అనే సంగతి అందరికి తెలిసిందే.
మౌత్ టాక్ బాగుంటే మూవీ లాంగ్ రన్ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగి భారీ వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ టాప్ లో ఉంది. ఈ సినిమా 415 కోట్ల కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు చేసింది. బాహుబలి 2 మూవీ 330 కోట్ల కలెక్షన్స్ తో తెలుగు స్టేట్స్ లో రెండో స్థానంలో ఉంది. కల్కి2898ఏడీ మూవీ 296.30 కోట్లతో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా ఉంది.
నాలుగో స్థానంలో ఉన్న సలార్ 234.05 కోట్ల కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. తరువాత రీజనల్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఆల వైకుంఠపురంలో మూవీ 203 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 5లో ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వరుసగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, బాహుబలి, చిరంజీవి సైరా, రామ్ చరణ్ రంగస్థలం సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల రికార్డ్ పై కన్నేసే ఛాన్స్ ఉంది. వీటిలో ఏ స్థానం దేవర సినిమా అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ పరంగా మూడో స్థానంలోకి వచ్చింది. దీనిని బీట్ చేసే ఛాన్స్ దేవరకి ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ - 415.00CR
బాహుబలి2 - 330Cr
కల్కి 2898ఏడీ - 296.30CR
సలార్ - 234.05CR
అల వైకుంఠపురములో - 203CR
వాల్తేరు వీరయ్య - 186.65CR
సరిలేరు నీకెవ్వరూ - 177.10CR
బాహుబలి - 175.40CR
సైరా: 168CR
రంగస్థలం - 160CR