తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే
ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.
తెలుగు సినిమాకి ప్రస్తుతం ఓ విధంగా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఓవర్సీస్ లో 30 రోజుల ముందుగానే ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి.
డిసెంబర్ 5న రిలీజ్ అయిన 'పుష్ప 2' సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు అద్భుతమైన కలెక్షన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే 1400 కోట్లు కలెక్షన్స్ క్రాస్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మూవీ 200 కోట్ల కలెక్షన్స్ షేర్ కి అడుగు దూరంలో ఉంది. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకి వీకెండ్ తో పాటు క్రిస్మస్ ఫెస్టివల్ కలిసొస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే షేర్ పరంగా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంది.
ఈ సినిమా లాంగ్ రన్ లో 272.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీని తర్వాత స్థానంలో 'బాహుబలి 2' ఉంది. ఈ సినిమా 204 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో రాబట్టింది. ఇక మూడో స్థానంలో ఉన్న 'పుష్ప 2' మూవీ 15 రోజుల్లో 199.15 కోట్ల షేర్ సాధించింది. ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక నాలుగో స్థానంలో 'కల్కి 2898ఏడీ' మూవీ 187.27 కోట్ల షేర్ తో ఉంది. ఐదో స్థానంలో ఉన్న యంగ్ టైగర్ 'దేవర' 162.80 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.
వచ్చే ఏడాది టాలీవుడ్ నుంచి 'గేమ్ చేంజర్', 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలలో ఏదైనా హైయెస్ట్ షేర్ అందుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. క్రేజ్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ భారీ వసూళ్లు సాధించడం ఖాయం అని అనుకుంటున్నారు. మరి వీటిలో ఏ సినిమా టాప్ షేర్ లోకి వస్తుందనేది చూడాలి. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.
ఆర్ఆర్ఆర్ - 272.31Cr
బాహుబలి 2 - 204Cr
పుష్ప 2 ది రూల్ – 199.15Cr (15 Days)*
కల్కి 2898ఏడీ - 187.27Cr
దేవర పార్ట్ 1 - 162.80Cr
సలార్ పార్ట్ 1 - 150.73Cr
అల వైకుంఠపురంలో - 130.17Cr
సరిలేరు నీకెవ్వరూ - 117.50Cr
వాల్తేరు వీరయ్య -115.10Cr
బాహుబలి - 114Cr