హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ 10 మూవీస్ ఇవే
బాలీవుడ్ ఏరియాల్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ‘పుష్ప 2’ రికార్డ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్ ఏరియాల్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ‘పుష్ప 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మొన్నటి వరకు 627 కోట్ల కలెక్షన్స్ తో టాప్ లో ఉన్న ‘స్త్రీ 2’ని బ్రేక్ చేసింది. 16 రోజుల్లో 645 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకుంది. ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శని, ఆదివారాలు మరల భారీ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
లాంగ్ రన్ లో 700 కోట్ల మార్క్ ని ఈ చిత్రం దాటుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ మూడో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత 15వ రోజు 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 16వ రోజైన శుక్రవారం 12.40 కోట్ల వసూళ్లు చేసింది. అయితే నెక్స్ట్ రెండు రోజులు కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్స్ లో చూడదగ్గ సినిమాలు లేవు. 25న వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ రిలీజ్ అవుతోంది. అంత వరకు నార్త్ లో థియేటర్స్ లో ‘పుష్ప 2’ సందడి మాత్రమే ఉండబోతోంది. ఇదిలా ఉంటే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోలు జాబితా చూసుకుంటే అల్లు అర్జున్ తర్వాత ‘స్త్రీ 2’తో రాజ్ కుమార్ రావు ఉన్నాడు.
నెక్స్ట్ మూడో స్థానంలో ‘జవాన్’ సినిమాతో 584 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని షారుఖ్ ఖాన్ నిలిచాడు. నాలుగో స్థానంలోకి ‘గదర్ 2’ మూవీతో 525.7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సన్నీ డియోల్ వచ్చాడు. నెక్స్ట్ టాప్ 5లో ఉన్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో 524.5 కోట్లు సాధించాడు. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి 2’ మూవీతో 511 కోట్ల కలెక్షన్స్ సాధించి టాప్ 6లో నిలిచాడు. తరువాత ‘యానిమల్’ తో రణబీర్ కపూర్, ‘కేజీఎఫ్ 2’తో రాకింగ్ స్టార్ యష్, ‘దంగల్’ మూవీతో అమీర్ ఖాన్, ‘సంజు’ చిత్రంతో రణబీర్ కపూర్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ హీరోలుగా ఉన్నారు.
పుష్ప 2 - 645Cr***(16days)
స్త్రీ 2 - 627Cr
జవాన్ - 584Cr
గదర్ 2 - 525.7Cr
పఠాన్ - 524.5Cr
బాహుబలి 2 - 511Cr
యానిమల్- 505Cr
కేజీఎఫ్ 2 - 434.7Cr
దంగల్ - 374.5Cr
సంజు - 342.6 Cr