నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలివే
'బాహుబలి 2' మూవీ మొదటి సారిగా నార్త్ అమెరికాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ ని ఏ ఇండియన్ మూవీ బ్రేక్ చేయలేదు.
నార్త్ అమెరికాలో ఆడియన్స్ గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలని బాగా ఆదరిస్తున్నారు. దీంతో అక్కడి మన సినిమాలకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. 'బాహుబలి 2' మూవీ మొదటి సారిగా నార్త్ అమెరికాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ ని ఏ ఇండియన్ మూవీ బ్రేక్ చేయలేదు. దీనిని బట్టి ఆ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమాకి నార్త్ అమెరికాలో ఏకంగా 20.77 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ ఆయిన డార్లింగ్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'కల్కి 2898ఏడీ' నార్త్ అమెరికాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్ స్పెక్టక్యులర్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.
దీంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ 'పుష్ప 2' వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అందులో నార్త్ అమెరికా నుంచి 15 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం విశేషం. కేవలం 27 రోజుల్లోనే ఈ కలెక్షన్స్ వచ్చాయి. 2024లో టాలీవుడ్ నుంచి వచ్చిన చాలా సినిమాలు నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు అందుకున్నాయి.
వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర', 'హనుమాన్' సినిమాలు కూడా ఉన్నాయి. 'దేవర' మూవీ నార్త్ లో 6.07 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాస్ చిత్రాల జాబితాలో టాప్ 7లో ఉంది. అలాగే 'హనుమాన్' మూవీ 5.3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో టాప్ 8లో నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. ఇవి కాకుండా నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉన్నాయి.
బాహుబలి 2 - $20.77M
కల్కి 2898ఏడీ - $18.57M
పుష్ప 2 - $15M*(27D)
ఆర్ఆర్ఆర్ - $14.33M
సలార్ - $8.92M
బాహుబలి - $8.47M
దేవర - $6.07M
హనుమాన్ - $5.31M
అల వైకుంఠపురములో - $3.63M
రంగస్థలం - $3.51M
భరత్ అనే నేను - $3.41M