ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్లు: లిస్టులో ఎంపురాన్ ట్విస్ట్!
ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రతి భాషలోనూ ఒక్కోసారి ఓ సినిమా దుమ్ముదులిపేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.;

ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రతి భాషలోనూ ఒక్కోసారి ఓ సినిమా దుమ్ముదులిపేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ వద్ద కాకుండా, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలా ఒక్కో భాషలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమాల కలెక్షన్స్ తో షాక్ ఇస్తున్నాయి. రీసెంట్ గా ఎంపురాన్ కాస్త డివైడ్ టాక్ అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ నుంచి మలయాళ పరిశ్రమ వరకూ టాప్ బ్లాక్ బస్టర్ సినిమాలపై ఒక లుక్కేస్తే..
బాలీవుడ్: దంగల్
ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2,024 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. చైనాలో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా. నిజ జీవిత క్రీడాకారిణుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, కంటెంట్ ఆధారంగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ స్థాయి విజయంతో బాలీవుడ్‌కు ఓ కొత్త మార్కెట్ తెరుచుకుంది.
టాలీవుడ్: బాహుబలి 2
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన బాహుబలి 2 సినిమా టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించింది. రూ.1810 కోట్ల వరకూ గ్రాస్ వసూల్ చేసిన ఈ చిత్రం, బాలీవుడ్ కు సైతం సమాధానం ఇచ్చే సీక్వెల్‌గా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది. విజువల్ గ్రాండియర్, ఇంటెన్స్ ఎమోషన్స్, భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యాయి.
కోలీవుడ్: 2.0
శంకర్ దర్శకత్వంలో, రజనీకాంత్ – అక్షయ్ కుమార్ నటించిన 2.0 కోలీవుడ్ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 655 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాలకూ ఇది ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ట్రైలర్స్ నుంచే అంచనాలు పెరిగిన ఈ చిత్రం, థియేటర్లో మాత్రం కాస్త మిక్స్ డ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తమిళ సినిమాగా కొనసాగుతోంది.
సాండల్వుడ్: కెజిఎఫ్ 2
యష్ నటించిన కెజిఎఫ్ ఛాప్టర్ 2 సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1250 కోట్లు వసూలు చేసింది. మాస్ యాక్షన్ డ్రామా, స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ కలసి కెజిఎఫ్ 2 ను ఓ కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభను నిరూపించుకున్న సినిమా ఇది. అలాగే కన్నడ ఇండస్ట్రీని పెంచిన సినిమా.
మాలీవుడ్: ఎల్ 2 ఎంపురాన్.. ఊహించని రికార్డ్
లేటెస్ట్ గా వచ్చిన L2: ఎంపురాన్ మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్, లూసిఫర్ తర్వాత వచ్చిన సీక్వెల్ కావడంతో విడుదలకు ముందే సాలీడ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్విస్ట్ ఇచ్చింది. ఇక శుక్రవారం నాటికి 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓ మాస్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకుంది. మలయాళ పరిశ్రమలో ఇంత భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రం ఇదే.