తెలుగు టైర్-2.. కుర్ర భామల గట్టి పోటీ!

ఏదేమైనా.. ఇప్పుడు తెలుగులో యంగ్ బ్యూటీలు బోలెడు మంది ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-09-24 19:30 GMT
తెలుగు టైర్-2.. కుర్ర భామల గట్టి పోటీ!
  • whatsapp icon

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవ లేదు. ఎప్పటికప్పుడు కొత్త భామలు.. చిత్రసీమకు పరిచయం అవుతూనే ఉంటారు. కొందరు డెబ్యూతోనే మంచి హిట్స్ సాధిస్తారు. మరికొందరు ఫ్లాప్స్ అందుకున్నా.. మెల్లగా క్రేజ్ సంపాదించుకుంటారు. ఇంకొందరు స్టార్టింగ్ లో సక్సెస్ అయినా.. ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. ఏదేమైనా.. ఇప్పుడు తెలుగులో యంగ్ బ్యూటీలు బోలెడు మంది ఉన్న విషయం తెలిసిందే. తమ సినిమాలతో అలరిస్తున్నారు. యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు.

అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో టైర్-1, టైర్-2 క్యాటగిరీస్ ఉన్న సంగతి తెలిసిందే. హీరోల్లానే.. హీరోయిన్లకు కూడా అవి ఉంటాయి. ఇప్పుడు టైర్-2 హీరోయిన్ల క్యాటగిరీలో టాప్ ప్లేస్ కోసం పలువురు బ్యూటీలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. వరుస ఛాన్సులు దక్కించుకుని.. టాప్ ప్లేస్ కు వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు భామలు. తమ అప్ కమింగ్ చిత్రాలపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు. వారిలో మీనాక్షి చౌదరీ.. అందరి కన్నా ముందు ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో మీనాక్షి చౌదరీకి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అటు సీనియర్ ఇటు జూనియర్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. 2024 సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంలో నటించిన అమ్మడు.. రీసెంట్ గా విజయ్ ది గోట్ లో మెరిసింది. ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తోంది. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రాలతో త్వరలో సందడి చేయనుంది.

రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన.. హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే టైర్-2 టాప్ ప్లేస్ పై కన్నేసింది. డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినా.. కొందరు మేకర్స్ దృష్టిలో పడింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ మూవీలో నటిస్తోంది. రానా, దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్ లో కూడా యాక్ట్ చేస్తోంది. అదే సమయంలో హీరోయిన్ నభా నటేష్.. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమాల్లో మళ్లీ యాక్ట్ చేస్తోంది. ప్రమాదంలో గాయపడి.. రెస్ట్ తీసుకుని.. వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు స్వయంభులో యాక్ట్ చేస్తోంది.

యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభులో ముఖ్యపాత్ర పోషిస్తోంది నభ. గట్టి హిట్ అందుకుని కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు, రాధిక.. అదేనండీ నేహా శెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది. మంచి హిట్ సాధించాలని పట్టుదలతో ఉంది. కెరీర్ ను మలుపు తిప్పే హిట్ కొట్టి.. టాప్ ప్లేస్ కు వెళ్లేందుకు ట్రై చేస్తోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కూడా యంగ్ హీరోయిన్లతో పాటు రేసులో ఉంది. మరి వీరంతా తమ కొత్త చిత్రాలతో ఎలా మెప్పిస్తారో.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News