బిగ్ బాస్ 8 : టాప్ 5 లో వీళ్లు కన్ఫర్మ్ అవ్వొచ్చా..?
బిగ్ బాస్ సీజన్ 8 లో జరిగిన ఎనిమిది వారాల్లో ఇప్పటివరకు ఎవరి స్టామినా ఏంటి అన్నది తెలిసింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో జరిగిన ఎనిమిది వారాల్లో ఇప్పటివరకు ఎవరి స్టామినా ఏంటి అన్నది తెలిసింది. ఇక నెక్స్ట్ ఆరేడు వారాల్లో ఈ సీజన్ ముగుస్తుండగా సీజన్ 8 లో టాప్ 5 గా ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 గా ఉండే అవకాశం ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఉంది అన్నది ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు. సీజన్ 8 లో టాప్ 5 గా దాదాపు పాత కంటెస్టెంట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారు కాకుండా మొత్తం పాత కంటెస్టెంట్స్ కి ఆ అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరు.. ఇంకా మాట తీరుని బట్టి ఈ సీజన్ టాప్ 5 ని ఆడియన్స్ ఎంపిక చేయనున్నారు. సీజన్ 8 లో ఇప్పటివరకు జరిగిన టాస్కులను చూస్తే నిఖిల్, ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్, యష్మిలకు టాప్ 5 ఉండే అవకాశం కనిపిస్తుంది. ఐతే యష్మి టాప్ 5 ఉండాలంటే మాత్రం ఇంకాస్త ఆట ఆడాల్సి ఉంటుంది.
ఇక రాయల్ క్లాన్ నుంచి అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో రోహిణి, అవినాష్ ఈ ఇద్దరిలో ఒకరికి టాప్ 5 కి ఛాన్స్ ఉంది. టాప్ 5 లో ఫైనల్ గా నిఖిల్, ప్రేరణ, నబీల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉండగా చివరి రెండు ప్లేస్ లలో అవినాష్, రోహిణి, విష్ణు ప్రియ, యష్మిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. రాబోయే వారాల్లో వీరి ఆటని బట్టి టాప్ 5 కి వారు అర్హులా కాదా అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా సీజన్ 8 లో టాప్ 5 ని గెస్ చేయడం అంత పెద్ద టఫ్ టాస్క్ అన్నది కాదని అర్థమవుతుంది.
కంటెస్టెంట్స్ అంతా సోసోగానే ఆడుతూ వస్తున్నారు. ఇక పృధ్వి కూడా టాప్ 5 కి ఉండే క్వాలిటీస్ ఉన్నాయి. టాస్కుల్లో అతని పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. ఐతే బిగ్ బాస్ అంటే ఒక్క టాస్క్ మాత్రమే కాదు హౌస్ లో మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అందుకే పృధ్వి ఈ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు టాప్ 5కి వెళ్తారు మిగతా వారాల్లో ఎవరి ఆట మెరుగు పడుతుంది. టాప్ 5 లో బయట జరుగుతున్న చర్చ కాకుండా అనూహ్యంగా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది రాబోయే వారాల్లో కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది.