డబుల్‌ ఇస్మార్ట్‌ సాగుతూనే ఉందట..!

కొన్ని కారణాల వల్ల ఇప్పటికే విడుదల అవ్వాల్సిన డబుల్‌ ఇస్మార్ట్‌ ఆలస్యం అయ్యింది.

Update: 2024-06-02 12:32 GMT

రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రూపొందుతున్న సీక్వెల్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఇప్పటికే విడుదల అవ్వాల్సిన డబుల్‌ ఇస్మార్ట్‌ ఆలస్యం అయ్యింది.

ఇటీవలే ముంబై లో షూటింగ్ ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ముంబై లో జరుగుతున్న ఈ షూటింగ్‌ కు వారం రోజుల క్రితం జాయిన్ అయిన రామ్‌ ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం నుంచి పది రోజుల పాటు ముంబై లోనే ఈ సినిమా షూటింగ్‌ జరుగబోతుందని సమాచారం అందుతోంది. ఈ షెడ్యూల్‌ లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌ కూడా పాల్గొనబోతున్నాడు.

ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మొదటి పాట రికార్డింగ్‌ జరుగుతుందని మణిశర్మ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

ఒకటి రెండు రోజుల్లోనే ఈ సినిమా మొదటి పాటను విడుదల చేసేందుకు గాను అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ మరియు పూరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కావ్య థాపర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది.

Tags:    

Similar News