70 ఏళ్ల క్రితం నాటి కథతో పాన్ ఇండియా!
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే కాదు వరల్డ్ నే షేక్ చేసే స్టోరీలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వెళ్లడం విశేషం. ఇటీవలే `కల్కి 2898` విజయంతో మరో సంచలనం నమోదైంది. రాజమౌళి తర్వాత తెలుగులో పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరు? అంటే గర్వంగా నాగ్ అశ్విన్ పేరు చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ ..చందు మొండేటి..ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్లు కూడా పాన్ ఇండియాని షేక్ చేసినవారే.
ఇక కన్నడ నుంచి ఇదే వరల్డ్ లో కి అడుగు పెట్టాలని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాసే సీరియస్ గానే కదులుతున్నారు. ప్రస్తుతం యశ్ తో `టాక్సిక్` అనే చిత్రాన్ని పాన్ ఇండియాలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ స్టర్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే ఈ స్టోరీని గీతూ చాలా కొత్తగా, వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకూ గ్యాంగ్ స్టర్ స్టోరీలంటే ప్రజెంట్ జనరేషన్ ని బేస్ చేసుకునే తీసారు.
కానీ గీతూ ఏకంగా ఈ కథ కోసం 70 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. టాక్సిక్ అనేది 1950-70 మధ్య కాలంలో జరిగే గ్యాంగ్ స్టర్ స్టోరీ అట. అప్పటివాతావరణాన్ని స్పృషించేలో బెంగుళూరులో సెట్ లు వేసి షూటింగ్ చేస్తున్నారుట. అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? వాళ్ల జీవిన విధానం ఎలా ఉండేది? అడ్వాన్స్ కల్చర్ లో ఉండే జనం ఎలా ఉండేవారు? వంటి విషయాలపై ఎంతో లోతుగా విశ్లేషించి కథ సిద్దం చేసి తెరకెక్కిస్తున్నారుట.
తన ఇమేజినేషన్ కి తగ్గట్టు సెట్లు అని అంతా పర్పెక్ట్ గా ఆర్ట్ డైరెక్టర్ తో దగ్గరుండి డిజైన్ చేయిస్తు న్నారుట. బెంగుళూరు శివార్లలో భారీ సెట్లు నిర్మిస్తున్నారుట. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఇందులో యశ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. నయనతార, హుమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్-మాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.