సత్య రాజ్ 'అనగా అనగా కథలా' సాంగ్.. సో మెలోడియస్ గురూ!

ఇప్పటికే ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-03 09:21 GMT
Sathya raj Tribanadhari Barbarik Song

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సత్యరాజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్భరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, విజయ్ పాల్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయగా.. సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి మరో ఫీల్ గుడ్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

అనగా అనగా కథలా అంటూ సాగే సాంగ్ ను టీకేఆర్ కాలేజీలోని విద్యార్థుల సమక్షంలో చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని దూసుకుపోతోంది. పాట అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

సాంగ్ ను కార్తీక్ ఆలపించారు. సింపుల్ గా ఆయన ప్రాణం పోశారని చెప్పాలి. ఎంతో వినసొంపుగా, అద్భుతంగా పాడారు. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సో మెలోడియస్. ఒక్కసారి వింటే అలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. సనరే రాసిన సాహిత్యం అయితే అదిరిపోయింది. ఒక్కో పదం.. మనసును హత్తుకుంటుంది.

తాతయ్య, మనవరాల మధ్య బంధాన్ని వివరించే సాంగ్ మాత్రం ఎవర్ గ్రీన్ అని అంతా చెబుతున్నారు. అసలు మైండ్ నుంచి పోవడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ గా షేర్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. సత్యరాజ్ తో పాటు మనవరాలిగా నటించిన చిన్నారి యాక్టింగ్ సూపర్ గా ఉందని చెబుతున్నారు.

అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక టీకేఆర్ కాలేజీలో సత్యరాజ్, డైరెక్టర్ మోహన్ శ్రీవత్స, నిర్మాత విజయ్‌ పాల్ రెడ్డి మాట్లాడారు. వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు సత్యరాజ్. త్వరలోనే మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోందని చెప్పారు. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉందని మోహన్ తెలిపారు. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పారు.

Full View
Tags:    

Similar News