బెంగాలీ బ్యూటీలో అన్ని కోణాలు ఒకేసారి ఇలా!
కానీ ఇవేవి సక్సెస్ పుల్ చిత్రాలు కాకపోవడంతో అమ్మడు టాలీవుడ్ లో మనుగడ కొనసాగించలేకపోయింది.
బెంగాలీ బ్యూటీ త్రిదా చౌదరి టాలీవుడ్ కి సుపరిచితమే. 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడు అటుపై ' మనసుకు నచ్చింది', ' అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి' అనే సినిమాలో చేసింది. కానీ ఇవేవి సక్సెస్ పుల్ చిత్రాలు కాకపోవడంతో అమ్మడు టాలీవుడ్ లో మనుగడ కొనసాగించలేకపోయింది. అటుపై మళ్లీ బెంగాలీ సినిమాల్లోనే నటించింది. మధ్యలో '7' అనే తెలుగు, తమిళ్ లో ఓ సినిమా చేసింది.
కానీ అది సక్సెస్ అవ్వలేదు. అలా చౌదరి బ్యూటీ ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఇన్ స్టాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. బెంగాలీ సంప్రదాయంలో ముస్తాబైన ఫోటోలతో పాటు, అవసరం మేర డిజైనర్ దుస్తుల్లోనూ సెగలు పుట్టిస్తుంది. తాజాగా అమ్మడు మరోసారి కొత్త ఫోటోల్ని వరుస పెట్టి మరీ వదిలింది. అన్నీ కోణాల్లోనూ తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.
తొలి పిక్ లో ఆద్యంతం స్కిన్ షోతో అలరించింది. టాప్..బాటమ్ టూపీస్ లో చూపరులను ఆకట్టుకుంది. గ్రనరీ అందంలో సేద తీరుతోన్న వైనాన్ని హైలైట్ చేసింది. మరో పిక్ లో బ్లూ కాంబినేషన్ టైట్ ఫిట్ దుస్తుల్లో సెగలు పుట్టించింది. చెట్టు మొదలు పై పడుకుని ఫోజులిచ్చింది. మరో పిక్ లో తనలో హాట్ బ్యూటీని ఆవిష్కరించింది. చీకటిలోనే అమ్మడు క్లీవేజ్ షోతో కవ్విస్తోంది. మరో పిక్ లో స్పోర్స్ట్ దుస్తుల్లోనూ ఫిట్ నెస్ ప్రీక్ గా హైలైట్ అయింది.
చివరి బ్లూ జీన్స్ స్కర్ట్ పై మ్యాచింగ్ టాప్ ధరించి...కళ్లకు అద్దాలు ..భుజాన హ్యాండ్ బ్యాగ్ తో స్టైల్ కా బాప్ అనిపించింది. ఇంకా మరో మూడు నాలుగు కొత్త ఫోటోలతో యువతని ఆకర్షిస్తుంది. మరి ఈ ప్రయత్నాలేవైనా కొత్త అవకాశాలు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి. అసలే టఫ్ కాంపిటీషన్ ఉంది. మరి ఈ పోటీలో త్రిదా చౌదరిని గుర్తించేది ఎవరో.