మాస్ రాజా మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్!
టాలీవుడ్ లో త్రినాధరావు నక్కిన మరో కమర్శియల్ డైరెక్టర్ గా పేరుంది. ఇప్పటి వరకూ అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ యావరేజ్ గా ఆడినవే. ఒకవేళ ఫెయిలైనా నిర్మాతకు భారీ నష్టాలైతే తెచ్చిన చిత్రాలు కావవి.
టాలీవుడ్ లో త్రినాధరావు నక్కిన మరో కమర్శియల్ డైరెక్టర్ గా పేరుంది. ఇప్పటి వరకూ అతడు తెరకెక్కిం చిన సినిమాలన్నీ యావరేజ్ గా ఆడినవే. ఒకవేళ ఫెయిలైనా నిర్మాతకు భారీ నష్టాలైతే తెచ్చిన చిత్రాలు కావవి. పరిమిత బడ్జెట్ లోనే నక్కిన కథలు ఉంటాయి. సింపుల్ లవ్ స్టోరీ, పైట్, పాట, కామెడీ తో సినిమా ముగుస్తుంది. `సినిమా చూపిస్తా మావ` నుంచి ఇతడి ట్రాక్ మరింత మెరుగ్గా ఉంది.
`నేను లోకల్``, `హలో గురూ ప్రేమకోసమే`,` ధమాకా` లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ తో `మజాకా` తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ అవుతుంది. ఇది కూడా పక్కా కమర్శియల్ ఎలిమెంట్స్ గల చిత్రమని ప్రచార చిత్రాలతో అర్దమవుతుంది. ఈ నేపథ్యంలో త్రినాధరావు తదుపరి సినిమా ఎవరితో అంటే? మళ్లీ మాస్ రాజా రవితేజని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజకు స్టోరీ లైన్ నచ్చడంతో ప్రస్తుతం త్రినాధరావు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరి కాంబినేషన్ లో మరో మాస్ సినిమా దాదాపు ఖాయమే. ఇప్పటికే ఇద్దరు కలయికలో రిలీజ్ అయిన `ధమాకా` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. `ధమాకా` ముందు వరకూ రవితేజకు వరుసగా ప్లాప్ లు ఉన్నాయి. `ధమాకా` విజయం కాస్త ఊరటనిచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.
దీంతో రాజా మళ్లీ త్రినాధరావు పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో `మాస్ జాతర` తెరకెక్కుతుంది. టైటిల్ ని బట్టే సినిమా ఎలా ఉంటుంది? అన్న దానిపై అభిమానులు ఓ అంచనాకి వచ్చారు. పక్కా మాస్ సినిమా ఇది. ఆ తర్వాత త్రినాధరావుతో చేయబోయేది కూడా మాస్ సినిమానే. ఇలా రవితేజ బ్యాక్ టూ పెవిలియన్ అవ్వడానికి ఓ కారణం ఉంది. కొత్త దర్శకు లతో చేసిన కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో మళ్లీ పుంజుకునే క్రమంలో భాగంగా ఇలా యూ టర్న్ తీసుకోవాల్సి వస్తోంది.