త్రినాధ్ రావు నక్కిన.. సౌండ్ లేకుండా మరొకటి స్టార్ట్!
సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరున్న త్రినాధ్ రావు నక్కిన మరోసారి మాస్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నారు.;
సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరున్న త్రినాధ్ రావు నక్కిన మరోసారి మాస్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నారు. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఈ దర్శకుడు, ఇటీవల మజాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే కమర్షియల్ ఫార్మాట్‌లో, కొత్త ఎనర్జీతో ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈసారి ఆయన చేయబోయే ప్రాజెక్టులో హీరో మామూలు వ్యక్తి కాదు.
KL యూనివర్సిటీ అధినేత వారసుడు హావిష్ కోనేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఇండస్ట్రీలో ప్రత్యెకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్న హవీష్ కొనేరు మొదటిసారి మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 2 నుంచే షూటింగ్ లోకి దిగుతుండడం విశేషం. త్రినాధ్ రావు నక్కిన ఇప్పటివరకు చేసిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉండటం, అంచనాలను పెంచుతోంది.
సినిమా చూపిస్తావా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకున్న ఆయన, ఈసారి కూడా అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్. ఇదే బేస్‌ను తీసుకుని, హవీష్ కొనేరుతో ఒక కొత్త యాంగిల్‌లో కథను తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. హవీష్ కొనేరు కూడా ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో కీలకమైన సినిమా చేయబోతున్నారు.
ఇప్పటి వరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్న ఆయన, ఈసారి పూర్తి కమర్షియల్ ఎనర్జీతో, పూర్తి జోష్‌లో కనిపించనున్నారని సమాచారం. గత సినిమాల కంటే ఈసారి మరింత వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నారని, ప్రత్యేకంగా ఆయనకు ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా త్రినాధ్ రావు స్టైల్‌లో క్యారెక్టర్ మలచినట్లు టాక్.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి. అయితే మేకర్స్ ఇప్పటికే పనులు ప్రారంభించేశారు. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, సినిమాలోని ప్రధాన తారాగణం వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, ఇది పూర్తి మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.
త్రినాధ్ రావు నక్కిన గత సినిమాల్లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ మిక్స్ చేసిన విధానం చూసుకున్నా, ఈసారి కూడా అలాంటి ఫార్మాట్‌నే రిపీట్ చేస్తారని అర్థమవుతోంది. అయితే, ఇందులో మునుపటి సినిమాల కంటే ఎక్కువ యాక్షన్ సీక్వెన్సులు, మాస్ అంశాలు మేళవించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హవీష్ పాత్రకు పూర్తి డిఫరెంట్ లుక్, సరికొత్త మాస్ అవతార్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.