ఈసారి మజాకా వాళ్లిద్దరితో ప్లాన్ చేస్తున్నాడా?
టాలీవుడ్ లో త్రినాధరావు నక్కిన మరో కమర్శియల్ డైరెక్టర్ గా పేరుంది. ఇప్పటి వరకూ అతడు తెరకెక్కిం చిన సినిమాలన్నీ యావరేజ్ గా ఆడినవే.;
టాలీవుడ్ లో త్రినాధరావు నక్కిన మరో కమర్శియల్ డైరెక్టర్ గా పేరుంది. ఇప్పటి వరకూ అతడు తెరకెక్కిం చిన సినిమాలన్నీ యావరేజ్ గా ఆడినవే. పరిమిత బడ్జెట్ లోనే నక్కిన కథలు ఉంటాయి. `సినిమా చూపిస్తా మావ`, `నేను లోకల్``, `హలో గురూ ప్రేమకోసమే`,` ధమాకా` లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇటీవలే ఆయన కొత్త చిత్రం `మజాకా` రిలీజ్ అయింది.
ఈ సినిమా కూడా పాస్ మార్కులతో పాస్ అయిపోయింది. ప్రస్తుతం థియేటర్లో రన్నింగ్ లో ఉంది. ఈనేపథ్యంలో త్రినాధరావు తదుపరి సినిమా విషయంలో ఇప్పటికే డిస్కషన్ షురూ అయింది. మాస్ రాజా రవితేజతో మరో సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ రేసులోకి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరాడు. త్రినాధరావు అగ్ర బ్యానర్లు మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లలో ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నట్లు సమాచారం.
రెండింటికి చేరో సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా దిల్ రాజు సంస్థలో చిత్రం చేయనున్నారని సమాచారం. దీనిలో భాగంగా అందులో హీరోగా బెల్లంకొండ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. యువ హీరోలతో దిల్ రాజు అనుబంధ సంస్థ సినిమాలు తీయడం పరిపాటే. ఈ నేపథ్యంలో ఇదే సంస్థలో సాయి శ్రీనివాస్ తో త్రినాధరావు సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయి.
అదే జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ లో రవితేజ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. `హైందవ`, `భైరవం`, `టైసన్ నాయుడు` సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత త్రినాధరావు-సాయి శ్రీనివాస్ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.