హీరోయిన్ త‌ల్లిదండ్రుల్ని బెదిరించిన‌ పొరుగింటోళ్లు!

వాటిని వినే వాళ్లు వింటారు. విన‌ని వాళ్లు విన‌రు. అయితే త్రిప్తీ డిమ్రీ విష‌యంలో అందుకు కాస్త భిన్న‌మైన స‌న్నివేశం క‌నిపిస్తుంది.

Update: 2024-09-23 07:35 GMT

సినిమా ఇండ‌స్ట్రీకి వెళ్తానంటే ఏ త‌ల్లిదండ్రి ఒప్పుకోరు. అక్క‌డ తీరు అంతా సాధార‌ణ జీవితానికి భిన్నంగా ఉంటుంద‌నే అపోహాలు చాలా మంది త‌ల్లిదండ్రుల్లో ఉంటాయి. సినిమా అన్న‌ది తెర మీద చూసినంత ఈజీగా ఉండ‌దు వాస్త‌వ జీవితం అని హెచ్చ‌రిస్తుంటారు. వాటిని వినే వాళ్లు వింటారు. విన‌ని వాళ్లు విన‌రు. అయితే త్రిప్తీ డిమ్రీ విష‌యంలో అందుకు కాస్త భిన్న‌మైన స‌న్నివేశం క‌నిపిస్తుంది.

సినిమాల్లోకి వెళ్తాన‌ని ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు చెబితే తొలిత భ‌య‌ప‌డి వ‌ద్ద‌న్నారుట‌. ఆ త‌ర్వాత మెల్ల‌గా ఎలాగూ త‌ల్లిదండ్రుల్ని ఒప్పించిందిట‌. అయితే అదే స‌మ‌యంలో త‌మ ఇంటి చుట్టు ప‌క్క‌లున్న వారు వారి త‌ల్లిదండ్రుల్ని బెదిరిచ‌డం మొద‌లు పెట్టారుట‌. సినిమాల్లోకి వెళ్లే మీ అమ్మాయి వ్య‌స‌నాల‌కు బానిస అవుతుంద‌ని, ఆ త‌ర్వాత ఎవ‌రూ పెళ్లిచేసుకోవ‌డానికి ముందుకు రార‌ని భ‌య‌పెట్టారు. వాళ్లు అదంతా నిజ‌మ‌ని చాలా భ‌య‌ప‌డ్డారు.

ప‌క్కింటి వారు ఇలాంటివి త‌ల్లిదండ్రుల‌కు చెబితే మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం స‌హ‌జం. ఆ విష‌యంలో త‌ల్లిదండ్రుల్ని ఎంతో ఒప్పించాల్సి వ‌చ్చింది. ఆ రోజు ఎంతో స‌హ‌నంతో వాళ్ల‌ను ఒప్పించి సినిమాల్లోకి వ‌చ్చాను. సినిమాలంటే చిన్న నాటి నుంచి ఉన్న ఆస‌క్తే న‌న్ను అలా ప్రేరేపించింది. ముంబై వ‌చ్చాక చాలా బాధ‌లు ప‌డ్డాను. ఎన్నో స‌వాళ్లు ఎదుర్కున్నాను. కొన్నిసంద‌ర్భాల్లో న‌మ్మ‌కం కోల్పోయాను. తిరిగి ఇంటికెళ్లిపోదాం అనుకున్నా. కానీ మా అమ్మ నాన్న‌ల్ని ఒప్పించి వ‌చ్చాను.

ఓ ఫెయిల్యూర్ గా ఇంటికి వెళ్లాలంటే మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. అలా అన్నింటిని భ‌రించి న‌టిగా స‌క్సెస్ అయ్యాను` అంది. సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కించిన `యానిమ‌ల్` సినిమాతో త్రిప్తీ డిమ్రీ పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News