త్రిప్తి.. స్టార్స్ ని వెనక్కి నెట్టి మరీ..!

యానిమల్ సినిమాకు ముందు కూడా అమ్మడు సినిమాలు, మ్యూజిక్ వీడియోస్ చేసింది.

Update: 2024-12-21 03:50 GMT

ఎన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాం అన్నది కాదు ఎప్పుడు పాపులర్ అయ్యామన్నది లెక్క అని చెప్పినట్టుగా సినిమాల్లోకి వచ్చి ఎన్నేళ్లు అవుతున్నా ఒక్క టర్న్ కోసం కొందరు ఎదురుచూస్తుంటారు. అలాంటి టర్న్ వచ్చినప్పుడు మాత్రం వారి క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ప్రస్తుతం అలాంటి దశలో తనకు వచ్చిన ఈ పాపులారిటీని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది త్రిప్తి డిమ్రి. యానిమల్ సినిమాకు ముందు కూడా అమ్మడు సినిమాలు, మ్యూజిక్ వీడియోస్ చేసింది. కానీ ఎందుకో అవేవి వర్క్ అవుట్ కాలేదు.

కానీ యానిమల్ తో అమ్మడు సెన్సేషన్ సృష్టించింది. అందులో చేసిన పాత్ర నిడివి తక్కువే అయినా కూడా ఇంపాక్ట్ బాగా కలిగించింది. తద్వారా త్రిప్తి కెరీర్ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. అంతేనా ఆడియన్స్ లో తన ఇమేజ్ ని డబుల్ చేసుకుంది. త్రిప్తి చేస్తున్న గ్లామర్ షోకి ఆడియన్స్ అంతా అలా పడి ఉంటున్నారన్నది నిజం. కెరీర్ మొదట్లో తనను ఎవరు గుర్తించకపోయినా యానిమల్ తర్వాత తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని చూసి సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మడు.

ఇక 2024 లో మరో అచీవ్ మెంట్ సాధించింది త్రిప్తి. సాధారణంగా బాలీవుడ్ లో స్టార్స్ తాకిడి ఎక్కువే. అక్కడ అందరినీ దాటుకుని నమ్నర్ 1 గా నిలవడం చాలా కష్టం. కానీ ఎంతోమంది స్టార్స్ ఉన్నా కూడా గూగుల్ సెర్చ్ లో త్రిప్తి నంబర్ 1 గా నిలిచింది. గూగుల్ సెర్చ్ లో త్రిప్తి మిగతా హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టేసింది. ఇదంతా యానిమల్ సినిమా ప్రభావమే అని తెలిసిందే. అయినా కూడా అమ్మడు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా రాని ఇమేజ్ ఒక్క సినిమాతో వచ్చేసింది.

త్రిప్తి తెర మీద చూస్తే చాలు బీ టౌన్ ఆడియన్స్ ఊగిపోతున్నారు. ఈమధ్య వచ్చిన రెండు సినిమాలు కూడా ఆమె గ్లామర్ డోస్ ని బాగానే వాడుకున్నట్టు అనిపించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో అమ్మడు అదరగొట్టేస్తుంది. సౌత్ సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నా ఎందుకో అమ్మడు ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఐతే యానిమల్ పార్క్ లో త్రిప్తి ఉంటుందా.. మళ్లీ తన అంద చందాలతో ఆడియన్స్ ని మెప్పిస్తుందా అంటూ సోషల్ మీడియాలొ త్రిప్తి గురించి చర్చిస్తున్నారు. ఏది ఏమైనా యానిమల్ తో అందరితో పాటు త్రిప్తికి కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ టైంలోనే త్రిప్తి సౌత్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఒకటి రెండు హిట్లు సాధిస్తే కెరీర్ పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News