పుష్ప 2 కోసం 'యానిమల్' బ్యూటీ కాదు...!
నిన్న మొన్నటి వరకు యానిమల్ స్టార్ త్రిప్తి డిమ్రీ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదించారని వార్తలు వచ్చాయి.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దాదాపు రెండేళ్లుగా పుష్ప 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పుష్ప లోని ఐటం సాంగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 లోనూ అదే స్థాయి ఐటెం సాంగ్ ను పెట్టాలని దర్శకుడు సుకుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఈ సినిమా ఐటం సాంగ్ కోసం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు యానిమల్ స్టార్ త్రిప్తి డిమ్రీ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదించారని వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 కోసం తృప్తి డిమ్రి ని ఐటెం సాంగ్ కోసం ఆడిషన్స్ సైతం నిర్వహించారు. కానీ చివరకు ఆమెను వద్దు అనుకున్నారు. ఇటీవల ఆమె చేసిన రెండు పాటలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. మరీ ఎక్కువ వల్గర్ గా ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తే, ఇలాంటి పాటలు ఏంటో అంటూ ఆమెను తీవ్రంగా విమర్శించిన వారు ఉన్నారు. అందుకే తృప్తి డిమ్రి ని కాకుండా మరో నటిని సినిమాలో ఐటెం సాంగ్ కి తీసుకోవాలని భావిస్తున్నారు. మళ్లీ కొత్త హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ సమాచారం అందుతోంది.
పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఐటం సాంగ్ గురించి అనౌన్స్ చేస్తారా అంటూ అల్లు అర్జున్ అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 కి ఐటం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే సుకుమార్ చాలా సీరియస్ గా ఐటం సాంగ్ ను తీసుకుంటున్నారు. అంతే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ సైతం ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం ప్రత్యేక శ్రద్ద ను కనబర్చుతున్నారు. ఇప్పటికే పలు ట్యూన్ ను రెడీ చేశారని, త్వరలోనే ఐటం సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వస్తుందని తెలుస్తోంది.
పుష్ప మొదటి పార్ట్ లో సమంత ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో సినిమా కీలక పాత్ర పోషించింది. ఐటం సాంగ్ ను దేవి శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించే విధంగా ట్యూన్ చేశారు. పుష్ప 2 సినిమా లోని పాటలకు మంచి స్పందన రావడం ఖాయం. ఇప్పటికే వచ్చిన పాటలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఐటం సాంగ్ అంతకు మించి ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకునే విధంగా పుష్ప 2 ను రూపొందిస్తున్న సుకుమార్ ఐటం సాంగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనేది చూడాలి.