త్రిప్తి ఉంటే చాలు డిమాండ్ ఒక రేంజ్..!
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నామన్నది ముఖ్యమని సినిమా వాళ్ల లెక్కలు ఉంటాయి
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నామన్నది ముఖ్యమని సినిమా వాళ్ల లెక్కలు ఉంటాయి. కొందరు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా తెచ్చుకోలేని క్రేజ్ మరికొందరు ఫస్ట్ సినిమాతోనే తెచ్చేసుకుంటారు. లక్ ఎవరికి ఎప్పుడు ఎలా ఫేవర్ చేస్తుంది అన్నది చెప్పడం కష్టం. అందుకే గ్లామర్ ఫీల్డ్ లో టాలెంట్ కన్నా కొన్నిసార్లు లక్ కే ఎక్కువ ఇంపాక్ట్ కలుగచేస్తుందని నమ్ముతారు. ఈ క్రమంలో అంతకుముందు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసినా రాని క్రేజ్ ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది త్రిప్తి డిమ్రి.
సందీప్ రెండ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో త్రిప్తి చేసిన పాత్ర చాలా చిన్నదే కానీ దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్న కన్నా ఆ సినిమా వల్ల త్రిప్తికి ఎక్కువ లాభం చేకూరిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసినా రాని గుర్తింపు త్రిప్తికి యానిమల్ సినిమా వల్ల వచ్చింది. అంతేకాదు ఆ సినిమా తర్వాత అమ్మడికి వరుస క్రేజీ ఆఫర్లు కూడా వస్తున్నాయి.
త్రిప్తి సినిమాలో ఉంది అంటే చాలు అనేస్తున్నారు యూత్ ఆడియన్స్. బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఆడియన్స్ కూడా త్రిప్తి మీద తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిప్తి లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూస్ రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమా ఓటీటీ రైట్స్ కు భారీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. కేవలం ఈ క్రేజీ డీల్ కి త్రిప్తి ఇమేజ్ కారణమని అంటున్నారు.
జూలై 19న రిలీజ్ అవుతున్న బ్యాడ్ న్యూస్ లో విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటించారు. 2019 లో వచ్చిన అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్ కి సీక్వెల్ గా ఇది తెరకెక్కించారు. ఐతే సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ అవ్వగా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ప్రైమ్ వీడియో భారీ మొత్తం కోట్ చేశారని తెలుస్తుంది. మొత్తానికి యానిమల్ తో ఏర్పడిన త్రిప్తి క్రేజ్ తన నెక్స్ట్ సినిమాలకు కొనసాగుతుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో కూడా త్రిప్తికి ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయని టాక్. ఐతే వాటిలో ఏది ఫైనల్ అన్నది బయటకు రాలేదు.