సెన్సార్ దగ్గర ఆగిన త్రిప్తి సినిమా
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు దఢక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు దఢక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరాఠా బ్లాక్ బస్టర్ మూవీ సైరాత్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కులాంతర ప్రేమ మీద సాగుతూ ట్రాజెడీ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా దఢక్2 రూపొందుతున్న విషయం తెలిసిందే.
యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, సిద్దార్థ్ చతుర్వేది జంటగా నటిస్తున్న ఈ సినిమాను ప్రస్తుతం ఓ సమస్య వెంటాడుతున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. ఫీలింగ్స్, ఎమోషన్స్, మనోభావాలు చాలా సెన్సిటివ్ గా మారిన తరుణంలో ఏదైనా సెన్సిటివ్ టాపిక్ మీద సినిమాలు తీసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లేని పోని సమస్యలు తప్పవు.
వాస్తవానికి దఢక్2 మార్చి 7న రిలీజ్ కానున్నట్టు అనౌన్స్ చేశారు. అంటే సినిమా రిలీజ్ కు ఇంకా పది రోజులే ఉంది. అయినప్పటికీ దఢక్2 కు సంబంధించి మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం దఢక్2 మరో వారం వాయిదా పడి మార్చి 14న రిలీజ్ కానుందంటున్నారు. కానీ దాన్ని కూడా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది లేదు.
అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం సెన్సార్ బోర్డు చెప్తున్న అభ్యంతరాలేనని తెలుస్తోంది. ఏడేళ్ల కిందట తమిళంలో వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్ కి రీమేక్ గా దఢక్2 తెరకెక్కుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. వెనుకబడిన, షెడ్యూల్ కులాల మీద తీసిన సినిమాగా ఆ సినిమాకు అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
ఈ కాన్సెప్ట్ తెలుగు నేటివిటీకి సూటవదని ఎవరూ ఇక్కడ దాన్ని డబ్బింగ్ కానీ రీమేక్ కానీ చేయలేదు. ఇప్పుడు దాన్నే నార్త్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారని అంటున్నారు. సినిమాలోని కొన్ని సీన్లు పలు వర్గాల మధ్య గొడవలు రాజేసేలా ఉన్నాయని, అందుకే దానికి ఎలాంటి కట్స్ ఇవ్వాలనే దానిపై సెన్సార్ సభ్యులు డిస్కషన్స్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలు నిజమైతే మాత్రం డైరెక్టర్ షాజియా ఇక్బాల్ దఢక్2 రిలీజయ్యాక అయినా పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వస్తుంది.