చీరలో త్రిప్తి సొగసు.. చూపు తిప్పుకోలేం!

బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిప్తి దిమ్రి తన స్టైల్ గ్లామర్ ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకర్షిస్తోంది.

Update: 2024-11-22 02:30 GMT

 బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిప్తి దిమ్రి తన స్టైల్ గ్లామర్ ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా త్రిప్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె చీరలో తన అందాన్ని హైలైట్ చేస్తూ యువత హృదయాలను కట్టిపడేసింది. ఎర్రని ఫ్లోరల్ డిజైన్ చీరలో, మిర్రర్ వర్క్ బ్లౌజ్ ధరించి స్టైలిష్ పోజులిచ్చిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చీరను సొగసుగా ధరించి, తన ప్రత్యేకమైన హావభావాలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది త్రిప్తి. త్రిప్తి తన సినీ కెరీర్‌ను 2017లో 'పోస్టర్ బాయ్స్' సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత 'లైలా మజ్ను' చిత్రంతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెకు బ్రేక్ తీసుకువచ్చింది 'బుల్బుల్' అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రం. ఈ హారర్ డ్రామాలో ఆమె పాత్ర ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

త్రిప్తి కెరీర్‌లో మరో బిగ్ హిట్ ‘యానిమల్’. ఈ సినిమాలో తన పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా, బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె పేరు బాలీవుడ్‌లో గట్టిగా వినిపించగా, నిర్మాతలు, దర్శకులు ఆమె కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్ సరసన 'బ్యాడ్ న్యూస్' చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్న త్రిప్తి, ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో పాటు, రాజ్ కుమార్ రావు సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

త్రిప్తి ఫోటోషూట్లతో ఎప్పుడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను వేడెక్కిస్తూ ఉంటుంది. ఆమె గ్లామర్‌ను, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను అభిమానులు ప్రశంసించడమే కాకుండా, ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోకి వేలల్లో లైకులు వస్తుంటాయి. ముఖ్యంగా చీరలో ఆమె అందాన్ని చూసి నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నట్లు టాక్.

Tags:    

Similar News