ఇండ‌స్ట్రీ క‌ష్టాలు చెప్పుకొచ్చిన హాట్ బ్యూటీ!

వెనుక ఎనిమిదేళ్ల క‌ష్టం ఉంద‌ని అమ్మ‌డు ఓపెన్ అయింది. 'న‌న్ను అంతా ఒక‌రాత్రిలోనే స్టార్ ని అయ్యాన‌నుకుంటున్నారు.

Update: 2024-10-22 15:30 GMT

'యానిమ‌ల్' విజ‌యంతో పాన్ ఇండియా లో త్రిప్తీ డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ఒక్క స‌క్సెస్ అమెని రాత్రి కి రాత్రే స్టార్ భామ‌ల జాబితాలో చేర్చేసింది. చేసింది చిన్న పాత్ర అయినా అగ్ర ప‌థాన కూర్చోబెట్టింది' అన్న‌ది నెటిజ‌నుల అభిప్రాయం. కానీ ఈ స్టార్ డ‌మ్ త‌నికి రాత్రికి రాత్రే వ‌చ్చింది కాద‌ని దీని వెనుక ఎనిమిదేళ్ల క‌ష్టం ఉంద‌ని అమ్మ‌డు ఓపెన్ అయింది. 'న‌న్ను అంతా ఒక‌రాత్రిలోనే స్టార్ ని అయ్యాన‌నుకుంటున్నారు.

 

కానీ ఈ స‌క్సెస్ వెనుక ఎనిమిదేళ్ల క‌ష్టం ఉంది. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కున్నాను. చాలా సార్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాను. చాలా ఆడిష‌న్స్ లో న‌న్ను ఏదో పేరుతో తిర‌స్క‌రించేవారు. దీంతో నాకు న‌ట‌న నిజంగా రాదా? అన్న సందేహం నాకే క‌లిగింది. నా జీవితంలో ప‌ని చేసిన రోజులు కంటే ప‌నిలేకుండా ఖాళీగా ఉన్న రోజులే ఎక్కువ‌గా ఉంటాయి. ఏం జ‌రుగుతుందో ? నాకే తెలియ‌క నా ప్ర‌శాంత‌త‌ని కోల్పోయేదాన్ని.

గంద‌ర‌గోళంలోకి వెళ్లేదాన్ని. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న గంద‌రగోళాన్ని చాలా ఇష్ట ప‌డుతున్నాను. నేను ప‌డిన క‌ష్టాల‌కు, అవ‌మానాల‌కు ఇప్పుడు ఫ‌లితాన్ని అనుభ‌విస్తున్నాను. ప్ర‌స్తుతం వ‌స్తోన్న వ‌రుస అవ‌కాశాల వ‌ల్ల క‌నీసం నాకు తిన‌డానికి స‌మ‌యం ఉండ‌టం లేదు. ఇది న‌న్ను ఎంతో ఆశ్చ‌ర్యానికి, తృప్తికి గురి చేస్తుంది. ఏ న‌టి అయినా ఇండస్ట్రీలో ఇంత బిజీగా ఉండాల‌నే వ‌స్తారు.

కానీ అవ‌కాశాలు రాక చాలా మంది వెనుదిరుగుతారు. ఇక్కడ స‌క్సెస్ అయ్యే వాళ్లు అంతా అదృష్టవంతుల‌ని న‌మ్ముతాను. ఎందుకంటే నాకంటే ట్యాలెంట్ ఉన్న వాళ్లు బ‌య‌ట చాలా మంది ఉన్నారు. వాళ్ల‌కు అవ‌కాశం రాక అక్క‌డ ఉన్నారు అంతే తేడా. సినిమా జీవితంలో విష‌యంలో చాలా బ్యాలెన్స్ గా ఉంటాను. ఇక్క‌డ అలా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. లేక‌పోతే చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి' అని అంది.

Tags:    

Similar News