ప‌విట కొంగు జారితే త‌ప్ప‌దులే తంటా

చీర‌కు త‌గ్గ‌ట్టుగా అంద‌మైన పింక్ బ్లౌజ్ ను కాంబినేష‌న్ గా జ‌త చేసిన ట్రిప్తీ ప‌విట కొంగు జారిపోతుంటే స‌రి చేసుకుంటూ ఫోజులిచ్చింది.

Update: 2024-10-22 16:25 GMT

'యానిమ‌ల్' చిత్రంతో అనూహ్యంగా పాపుల‌రైన న‌టి ట్రిప్తి దిమ్రీ. ఈ చిత్రంలో ఘాటైన స‌న్నివేశాల్లో జీవించి యువ‌త‌రం హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుసగా సీక్వెల్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇవ‌న్నీ రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ట్రిప్తి కిల్ల‌ర్ ఫోటోషూట్లు కాక‌లు పుట్టిస్తున్నాయి. తాజాగా డీప్ పింక్ శారీలో కృతి హొయ‌లు పోయిన తీరు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. చీర‌కు త‌గ్గ‌ట్టుగా అంద‌మైన పింక్ బ్లౌజ్ ను కాంబినేష‌న్ గా జ‌త చేసిన ట్రిప్తీ ప‌విట కొంగు జారిపోతుంటే స‌రి చేసుకుంటూ ఫోజులిచ్చింది. ఈ లేటెస్ట్ పోటోషూట్ లో ట్రిప్తీ భంగిమ‌లు వేగంగా వైర‌ల్ అయిపోతున్నాయి.


మ‌రోవైపు ట్రిప్తీ న‌టించిన సినిమాల పోస్ట‌ర్లు టీజ‌ర్లు విడుద‌ల‌వుతూ యువ‌త‌రంలో వేడి పెంచుతున్నాయి. తాజాగా కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 3 నుంచి కొత్త పాట విడుద‌లైంది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ కొద్ది రోజుల క్రితం విడుదలై అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి రెండవ ట్రాక్ విడుదలైంది. మంగళవారం, మేకర్స్ జానా సంజో నా- రొమాంటిక్ ట్రాక్‌ని విడుదల చేసారు. ఇది కార్తీక్ - ట్రిప్తి డిమ్రీ జంట‌పై చిత్రీక‌రించిన పాట‌. ఆదిత్య రిఖారి సాహిత్యాన్ని అందించగా, జానా సంఝో నాను ఆదిత్య రిఖారి- తులసి కుమార్ పాడారు. మ్యూజిక్ వీడియోకి బాస్కో సీజర్ కొరియోగ్రఫీ అందించారు. రంగురంగుల విజువల్స్ కార్తిక్, ట్రిప్తి పాత్రలు వారి న‌డుమ‌ రొమాన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మ్యూజిక్ వీడియోలో కార్తీక్ వందలాది మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. విజువ‌ల్స్ లో పూల రేకులతో నిండిన పడవలో ట్రిప్తీ అతడితో కలుస్తుంది.


ఈ పాటలో కార్తీక్ -ట్రిప్తి మధ్య కెమిస్ట్రీని అభిమానులు ఇష్టపడుతున్నారు. ఈ జంట అందంగా ఉంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు.


భూల్ భూలయ్యా 3 ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం కాగా, 2007లో ప్రియదర్శన్ ఈ హారర్ కామెడీ ఫ్రాంచైజీ ని ప్రారంభించారు. మొదటి చిత్రం అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఘోస్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్ర‌స్తుత చిత్రం భూల్ భూలయ్యా 3లో మాధురీ దీక్షిత్ కూడా నటించారు, విద్యాబాలన్ మంజూలికగా తిరిగి వచ్చింది. అనీస్ బాజ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది. ఇది రోహిత్ శెట్టి సింగం ఎగైన్ తో ఢీకొంటుంది. హారర్-కామెడీ చిత్రంలో కార్తీక్ తన రూహ్ బాబా పాత్రలో మళ్లీ కనిపించనున్నాడు. భూల్ భూలయ్యా 3లో రాజ్‌పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, విజయ్ రాజ్ కూడా న‌టించారు.

Tags:    

Similar News