వైల్డ్ జోన్ లో త్రివిక్రమ్ వారసుడు
త్రివిక్రమ్ కుమారుడు సినిమాల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపుతూ పెరిగాడు. తండ్రి కంటే ముందే తనకంటూ ఒక స్టైల్‌ను డెవలప్ చేసుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది.
సందీప్ వంగా ‘ఆనిమల్’ సినిమాతో వైల్డ్ స్క్రీన్‌ప్లే అంటే ఏమిటో అందరికీ చూపించాడు. సినిమా ఒక ఫార్ములా ప్రకారం కాకుండా, విభిన్నమైన కంటెంట్, ఇంటెన్స్ ఎమోషన్, బోల్డ్ నేరేషన్‌తో తెరకెక్కినా, ఆడియెన్స్‌ను కట్టిపడేయగలదని నిరూపించాడు. కచ్చితంగా చెప్పాలంటే, వంగా తన స్టైల్‌తో ఇండస్ట్రీలో ఒక సొంత జోన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు, ఆ వైల్డ్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నాడు త్రివిక్రమ్ వారసుడు.
త్రివిక్రమ్ కుమారుడు సినిమాల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపుతూ పెరిగాడు. తండ్రి కంటే ముందే తనకంటూ ఒక స్టైల్‌ను డెవలప్ చేసుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదట అతను త్రివిక్రమ్ సొంత సినిమాల్లో అసిస్టెంట్‌గా అనుభవం సంపాదించుకున్నాడు. కానీ, కేవలం తండ్రి కింద మాత్రమే కాకుండా, ఫిల్మ్‌మేకింగ్‌లో పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే లేటెస్ట్ ట్రెండ్ ను కూడా ఫాలో అవ్వాలని నేటితరం యువ దర్శకుల దగ్గర కూడా శిష్యరికం చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తోన్న VD12 సినిమాలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం అతని కెరీర్‌లో ఒక స్పెషల్ అచివ్ మెంట్. ఈ సినిమా షూటింగ్ దశలోనే, అతనిలోని క్రియేటివిటీ, వర్క్ ఎథిక్‌ను గమనించిన యూనిట్ సభ్యులు, అతనిని ప్రతిభావంతుడిగా పేర్కొన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ అనుభవంతో మరో లెవెల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ ప్రాజెక్టులో కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరనున్నాడట. సాధారణంగా ఒక కొత్త వ్యక్తికి ఆ స్థాయి ప్రాజెక్టులో పని చేసే అవకాశం రావడం చాలా కష్టం. కానీ త్రివిక్రమ్ సూచనతో, అలాగే అతని సొంత స్కిల్స్ కారణంగా ఈ అవకాశం సొంతం చేసుకున్నట్లు టాక్. వంగా లాంటి ఇంటెన్స్ డైరెక్టర్‌తో పని చేయడం, సినిమా మేకింగ్‌లో ప్రతి న్యూస్‌లైన్స్, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే షేడ్స్‌కి అవగాహన పొందడమే కాకుండా, వృత్తిపరంగా ఎదగడంలో కీలకంగా మారనుంది.
ఇలాంటి బలమైన బ్యాక్‌గ్రౌండ్‌తో త్రివిక్రమ్ తనయుడు డైరెక్టర్‌గా మారడానికి పెద్దగా సమయం తీసుకోడని పరిశ్రమలో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల, పవన్ కుమారుడు అఖిరా నందన్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశం కూడా ఉందని ఫిలిం సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, త్రివిక్రమ్ కుమారుడు తండ్రి లాగే స్టార్ డైరెక్టర్‌గా ఎదగడానికి గట్టి పునాది వేసుకుంటున్నాడు. మరి అతని మొదటి అడుగు వైల్డ్ గా ఉంటుందా లేక తండ్రి తరహాలో ఎమోహన్స్ తో కూడిన యాక్షన్ తో ఉంటుందా అనేది చూడాలి.