వీడియో: జాన్వీ కపూర్‌పై క్రూరమైన ట్రోలింగ్
ఇక శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ ఎల్ఎఫ్డబ్ల్యూ ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు బాడీ హగ్గింగ్ స్కర్ట్ - స్ట్రాప్‌లెస్ బ్లౌజ్లో ఆకర్షణీయంగా కనిపించింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ -2023 గడగడలాడిస్తోంది. నీతా అంబానీకి చెందిన కల్చరల్ సెంటర్ లో తారల హంస నడకలతో ముంబై షేకైంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వేదికను హీటెక్కించారు. ఇక శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ ఎల్ఎఫ్డబ్ల్యూ ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు బాడీ హగ్గింగ్ స్కర్ట్ - స్ట్రాప్‌లెస్ బ్లౌజ్లో ఆకర్షణీయంగా కనిపించింది. అయితే సోషల్ మీడియాలో కపూర్ గాళ్ లుక్, నడక పరంగా మరోసారి షో స్టాపర్ గా నిలిచింది.
ప్రస్తుత తరం నటీమణుల్లో జాన్వీ కపూర్ అతిపెద్ద ఫ్యాషనిష్టా. జిమ్‌లో, ఎయిర్పోర్ట్ లుక్స్‌లో, ఈవెంట్లు లేదా ర్యాంప్‌లలో శ్రీదేవి కుమార్తె తరచుగా తన సార్టోరియల్ ఎంపికలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ ఇటీవల డిజైనర్ అమిత్ అగర్వాల్ సారథ్యంలో లాక్మేవీక్ లో ర్యాంప్‌పై నడిచింది. అందరి కళ్ళు ఆమెపైనే ఉండేలా చూసుకుంది. ఎంపిక చేసిన బాడీ హగ్గింగ్ స్కర్ట్ - స్ట్రాప్‌లెస్ బ్లౌజ్లో ఆకర్షణీయంగా కనిపించింది.
ర్యాంప్ చుట్టూ ప్రేక్షకులు జాన్వీకపూర్ హంస నడకలకు బోల్తా పడ్డారని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ని మాత్రం జాన్వీ లుక్, నడక మెప్పించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. జాన్వీ ఈ బాడీ హగ్గింగ్ దుస్తులలో నడవలేనట్లు కనిపిస్తోంది! అని ఒక నెటిజన్ రాశారు. దయచేసి ఆమెను లెజెండరీ శ్రీ దేవితో ఎప్పుడూ పోల్చవద్దు అని ఒకరు కామెంట్ చేసారు. నువ్వు దారితప్పిన దానిలా నడుస్తావు! అని ఒకరు కామెంట్ చేయగా, ఆమె గిగి హడిద్ (ఆ హెయిర్ ఫ్లిప్)ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తోందని ఒక సోషల్ మీడియా యూజర్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, జాన్వీకి ఆమె అభిమానులు, అనుచరులు, పరిశ్రమ వ్యక్తుల నుండి లభించే ప్రేమ ప్రశంసల ముందు నెటిజన్లలోని ఒక నిర్దిష్ట విభాగం వెదజల్లుతున్న ద్వేషం చాలా తక్కువ.
ధడక్ తర్వాత బాలీవుడ్ లో కెరీర్ పరంగా చాలా దూరం వచ్చింది జాన్వీ. ఇప్పుడు టాలీవుడ్ లోను అడుగుపెడుతోంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. నటిగానే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రకటనల ఆదాయంలోను జాన్వీని నేటితరంలో కొట్టేవాళ్లే లేరు. జాన్వీ ఇప్పటికే పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.