బాబు ఓం రౌత్.. హనుమాన్ బడ్జెట్ చూసావా?

ఇప్పుడు.. హనుమాన్ మూవీ ఎఫెక్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పై గట్టిగానే పడింది. హనుమాన్ హిట్ అవ్వడం ఏంటో గానీ ఓం రౌత్‌ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.

Update: 2024-01-12 04:33 GMT

యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్టులు వచ్చాయి. ఈ మూవీ టార్గెట్ కూడా పెద్దది కాదు. ఈజీగా వీకెండ్‌ లోపే బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గుంటూరు కారం మూవీకే అన్ని థియేటర్లు కేటాయించడంతో హనుమాన్‌ కు అసలు స్క్రీన్లు దొరకలేదు. తక్కువ థియేటర్లలో విడుదలైనా.. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

హనుమాన్ సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది రూ.20 నుంచి 25 కోట్ల మధ్యలోనే. కానీ రాబట్టుకున్న అవుట్ పుట్ మాత్రం వంద కోట్లకు పైగా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్ తో అంత క్వాలిటీని ఎలా రాబట్టారో ప్రశాంత్ వర్మ నుంచి అంతా నేర్చుకోవాలని అంటున్నారు నెటిజన్లు. ఇది టాలీవుడ్‌, బాలీవుడ్ మేకర్లు తెలుసుకోవాల్సిన విషయమని, ఇదొక గైడెన్స్‌ లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని చెబుతున్నారు.

ఇప్పుడు.. హనుమాన్ మూవీ ఎఫెక్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పై గట్టిగానే పడింది. హనుమాన్ హిట్ అవ్వడం ఏంటో గానీ ఓం రౌత్‌ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. హనుమాన్ మూవీ చూశాక ఓం రౌత్.. ఆదిపురుష్ తీయాల్సిందని ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా అంటే ఇలా తీయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో ఓం రౌత్ ఆదిపురుష్ లో చీప్ వీఎఫ్ఎక్స్‌ అందించారని.. ప్రశాంత్ వర్మ మాత్రం రూ.25 కోట్లతో అద్భుతం సృష్టించారని అంటున్నారు.

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ మూవీ ట్రైలర్ రిలీజైనప్పుడే వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ దెబ్బతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ వీఎఫ్ఎక్స్ రీ క్రియేట్ చేయించినా, ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఆదిపురుష్ సినిమా అనడం కంటే వీడియో గేమ్ అంటే బాగుంటుందని పలువురు విమర్శలు చేశారు.

ఈ మూవీలోని డైలాగులు కూడా అంత బాగా లేవనే టాక్ వినిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించారు. సన్నీ శర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. రూ. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు హనుమాన్ మూవీ హిట్ అవ్వడంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా మారింది వ్యవహారం. ఓం రౌత్ పై ట్రోలింగ్, మీమ్స్ వస్తుండడంతో మళ్లీ ఆదిపురుష్ చర్చల్లోకి వచ్చింది.

Tags:    

Similar News