తుంబాడ్ రీ రిలీజ్ బాక్సాఫీస్.. ఇదెక్కడి ఊచకోత సామీ

ఈ రీరిలీజ్ లో ‘తుంబాడ్’ మూవీ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో అద్భుతమైన ఆదరణతో దూసుకుపోతోంది.

Update: 2024-10-05 04:42 GMT

హిందీలో హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ గా 6 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘తుంబాడ్’ మూవీకి అద్భుతమైన ఆదరణ లభించింది. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఏకంగా 12.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ ని మూవీ వసూళ్లు చేసింది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా మంది చూసారు. ఇదిలా ఉంటే మరల ఈ సినిమాని హిందీలో సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేశారు.

ఈ రీరిలీజ్ లో ‘తుంబాడ్’ మూవీ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో అద్భుతమైన ఆదరణతో దూసుకుపోతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. మొదటి సారి రిలీజ్ అయినపుడు వచ్చిన కలెక్షన్స్ తో చూసుకుంటే ఈ సెకండ్ రిలీజ్ లో రెట్టింపు వసూళ్ళని ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు తుంబాడ్ మూవీ 30 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

దసరా సెలవులు కలిసి రానున్న నేపథ్యంలో మూవీ వసూళ్లు 50 కోట్లు క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో హిందీలో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘స్త్రీ 2’ ఏకంగా 800 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. దానికంటే ముందు వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘మంజ్య’ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు అద్భుతమైన ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న ‘తుంబాడ్’ మూవీ స్టోరీ కూడా హర్రర్ థ్రిల్లర్ జోనర్ లోనే ఉండటం విశేషం.

ఈ సినిమాలకి వస్తోన్న ఆదరణ చూస్తుంటే నార్త్ ఇండియన్ ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల కంటే హర్రర్, థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారని అర్ధమవుతోంది. ఆడియన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. సోహమ్ షా ‘తుంబాడ్’ సినిమాలో వినాయక్ రావ్ గా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయడంతో పాటు నిర్మాతలలో ఒకరిగా ఉన్నాడు.

‘తుంబాడ్’ కి సీక్వెల్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని సోహమ్ షా గతంలో ప్రకటించారు. ఈ సినిమాని తెరకెక్కించిన రాహి అనిల్ బార్వే రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్ ఇందులో మెయిన్ లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ‘తుంబాడ్ 2’ స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు.

Tags:    

Similar News