ఇంటర్వ్యూ: నేను 20 సినిమాలే చేసినా, అవి ఎప్పటికీ గుర్తుండి పోవాలి: అల్లు శిరీష్

ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, కమెడియన్ అలీ, అజ్మల్ 'తుపాకీ డాట్ కామ్' కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Update: 2024-07-24 10:15 GMT
ఇంటర్వ్యూ: నేను 20 సినిమాలే చేసినా, అవి ఎప్పటికీ గుర్తుండి పోవాలి: అల్లు శిరీష్
  • whatsapp icon

మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నారు. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. కమర్షియాలిటీ వైపు పరుగులు తీయకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా "బడ్డీ". శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, కమెడియన్ అలీ, అజ్మల్ 'తుపాకీ డాట్ కామ్' కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా విశేషాలతో పాటుగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 'ఊర్వశివో రాక్షసివో' తర్వాత కావాలని గ్యాప్ తీసుకోలేదని, ఎంత త్వరగా సినిమా చెయ్యాలనుకున్నా ఏదొక విధంగా లేట్ అవుతూ వస్తోందని శిరీష్ అన్నారు. బడ్డి సినిమా గతేడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నామని, కానీ మూవీలో 3200 సీజీ షార్ట్స్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు టైం పట్టిందని తెలిపారు. తన ఫిల్మోగ్రఫీలో 20 సినిమాలున్నా సరే, అవి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలనేదే తన ప్రయత్నమని చెప్పారు. బడ్డీ చిత్రానికి ఆర్య 'టెడ్డీ' సినిమాతో, హలీవుడ్ టెడ్డీ బేర్ మూవీతో ఎలాంటి సంబంధం లేదని.. ఇది పూర్తిగా భిన్నమైన కథని శిరీష్ క్లారిటీ ఇచ్చారు. బడ్డీ టీమ్ చెప్పిన మరిన్ని సంగతులు తెలుసుకోడానికి ఈ క్రింది ఇంటర్వూ చూడండి...

Full View
Tags:    

Similar News