49వ‌య‌సులో చ‌దువుల కోసం న‌టి లండ‌న్ ఛ‌లో

షారూఖ్ బాద్ షా స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-30 20:30 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న శీను (1999) అనే సినిమాలో న‌టించింది ట్వింకిల్ ఖ‌న్నా. షారూఖ్ బాద్ షా స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. 1995 నుంచి న‌టిగా కెరీర్ కొన‌సాగించిన ట్వింకిల్, నిర్మాతగాను ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. ట్వింకిల్ నిర్మించిన‌ చివరి చిత్రం 'ప్యాడ్ మ్యాన్'(2018). చ‌క్క‌ని సందేశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు దక్కాయి.


న‌టిగా, నిర్మాత‌గానే కాదు ట్వింకిల్ ర‌చ‌యితగాను సుప‌రిచితురాలు. మిసెస్ ఫన్నీబోన్స్, ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్, పైజామా ఆర్ ఫర్గివింగ్ వంటి బెస్ట్ సెల్లర్ పుస్త‌కాలను ట్వింకిల్ రాసారు. మహమ్మారి సమయంలో కొన్ని ఆన్‌లైన్ కోర్సులను అభ్యసించిన తర్వాత గోల్డ్‌స్మిత్స్ లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి మాస్టర్స్ డిగ్రీని సంపాదించింది. ఈ ఏడాది జనవరిలో పట్టభద్రురాలైంది. అయితే 49 వ‌య‌సులో పూర్తి సమయం చదువును కొనసాగించనున్నట్లు ప్రకటించింది. దాని కోసం తన కుమార్తె నితారాతో కలిసి లండన్‌కు మకాం మార్చాలని యోచిస్తోంది. అక్షయ్ కుమార్ తన భార్య నిర్ణయానికి చాలా మద్దతుగా నిలిచారు.

నిజానికి అక్ష‌య్ కెన‌డా పౌర‌స‌త్వాన్ని తీసుకున్నాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల తిరిగి దానిని ర‌ద్దు చేసుకుని భార‌త పౌర‌స‌త్వానికి మారాడు. ఇప్పుడు అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా లండ‌న్ వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌టికే అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ దంపతులు త‌మ మ‌కాం పూర్తిగా లండ‌న్ కి మార్చార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత అనుష్క శ‌ర్మ చ‌దువుల కోసం కొన్నేళ్ల పాటు లండ‌న్ లోనే స్థిర‌ప‌డతుండ‌డం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News