దావూద్ ఇబ్రహీంతో లింకు.. స్టార్ హీరోయిన్ జవాబు
మందాకిని మొదలు పలువురు కథానాయికలు దావూద్ తో ప్రేమాయణం సాగించారని కథనాలు వైరల్ అయ్యాయి.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకు పెట్టి పలువురు కథానాయికలపై మీడియా కథనాలు అల్లిన సంగతి తెలిసిందే. మందాకిని మొదలు పలువురు కథానాయికలు దావూద్ తో ప్రేమాయణం సాగించారని కథనాలు వైరల్ అయ్యాయి. పాపులర్ తెలుగు హీరోయిన్ దావూద్ కి ప్రియురాలు కావడంతో తన కెరీర్ ని కోల్పోయింది. దావూద్ శిష్యుడు అబూసలేంతో ప్రేమాయణం సాగించడమే కాక తన కోసం కెరీర్ నే వదులుకుంది శ్రీకాంత్ 'తాజ్‌మహల్' హీరోయిన్ మోనికా భేడీ.
ఈ కథలన్నీ అలా ఉంచితే... దావూద్ ఇబ్రహీం కోసం డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారనే పాత ఆరోపణపై ఖిలాడీ అక్షయ్ కుమార్ భార్య, ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నాపై కథనాలు వైరల్ అయ్యాయి. వాటిపై ట్వింకిల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనపై ప్రచురితమైనవి అన్నీ ఫేక్ వార్తలు అని ట్వింకిల్ అన్నారు. నా డ్యాన్స్ నైపుణ్యాలపై రకరకాలుగా ప్రచారమైంది. నిజానికి నా డ్యాన్స్ స్కిల్స్ WWF మ్యాచ్‌ని చూడటం లాంటివి.. అని తనపై తానే సెటైర్ వేసుకుంది.
ట్వింకిల్ ఖన్నా ప్రముఖ రచయితగాను సుపరిచితురాలు. గొప్ప తెలివితేటలు.. సుదీర్ఘ దృష్టితో కూడిన వ్యాఖ్యలు చేయడంలోను ట్వింకిల్ పాపులర్ అయింది. ఈసారి నకిలీ వార్తలపై ట్వింకిల్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పారిపోయిన అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం తాను డ్యాన్స్ ప్రదర్శన చేసానని వచ్చిన వార్తలు అవాస్తవమని ట్వింకిల్ వెల్లడించారు. తన డ్యాన్స్ స్కిల్స్ ని ట్వింకిల్ నిజంగా తక్కువ చేసి మాట్లాడారు. నేను దావూద్ కోసం ఒక మెడ్లీ పాటలను ప్రదర్శించానని ఒక మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ ఛానల్ ప్రచారం చేసింది. టిక్కర్‌లో నా పేరును కూడా చూశాను.``నా పిల్లలు కూడా నా డ్యాన్స్ నైపుణ్యాలు చూశాక.. ఒంటరి మల్లయోధుడు - గురుత్వాకర్షణ మధ్య జరిగే WWF మ్యాచ్‌ని చూడటం లాంటివి`` అని కామెంట్ చేస్తారు. ``దావూద్ మరింత నైపుణ్యం కలిగిన డ్యాన్సర్ నే ఎన్నుకుంటాడని వార్తా ఛానెల్‌లకు తెలిసి ఉండాలి. కానీ ఇది నకిలీ వార్తల ప్రపంచం`` అని ట్వింకిల్ కొట్టి పారేసింది.
నకిలీ వార్తల ప్రభావం సమాజంపై చాలా ఎక్కువ. సామాజాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. తారుమారు చేసిన వార్తా కథనాలను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తాయని ట్వింకిల్ పేర్కొంది - ముఖ్యంగా వాట్సాప్ -యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు ప్రచారం సాగుతోందని ట్వింకిల్ ఆవేదన చెందింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ఆన్‌లైన్‌లో చెలామణి అవుతున్న తప్పుడు సిద్ధాంతాలే కారణమని చెన్నైలోని టాక్సీ డ్రైవర్‌తో జరిగిన పరస్పర చర్చ గురించి ట్వింకిల్ వివరించింది.