రాజస్థాన్ లో టైసన్ పోరాటం!
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం రాజస్థాన్ లో మొదలైంది. దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ ఇక్కడే జరుగుతుంది.
యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ కోసం కసిమీదున్నాడు. 'రాక్షసుడు' తర్వాత హిట్ అందని ద్రాక్షలా మారడంతో భారీ హిట్ కొట్టాలని ఎంతో ఏకాగ్రతతతో టైసన్ నాయుడిని పట్టాలెక్కించాడు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న సాగర్. కె. చంద్ర కూడా అంతే కమిట్ మెంట్ తో పని చేస్తున్నాడు. 'భీమ్లా నాయక్' లాంటి భారీ విజయం ఉన్నా! ఆ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలోకి పోవడంతో శ్రీనివాస్ పిలిచి మరీ టైసన్ నాయుడు కి అవకాశం ఇచ్చాడు.
ఇప్పుడతని నమ్మకంతో పాటు... సాగర్ కూడా గట్టిగానే కొట్టాలని పని చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా సెట్స్ కి వెళ్లి నెలలు గడుస్తుంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రతీ ప్రేమ్ ని చెక్కుతున్నట్లే కనిపిస్తుంది. అందుకే గ్యాప్ తీసుకుని మరి నిదానంగా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం రాజస్థాన్ లో మొదలైంది. దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. రాజస్థాన్ పరిసర ప్రాంతాలతో పాటు..అక్కడ ప్రతిష్టాత్మక కోటల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
రాత్రిపూట ప్రత్యేకంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారుట. ముందుగా నైట్ షూట్ కి సంబంధించిన సన్నివేశాలు హీరోపై చిత్రీకరిస్తున్నారుట. డే సమయంలో హీరో లేని మిగతా సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేకంగా హైలైట్ అవుతాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ కోరియోగ్రాఫర్ శివ ఆ ధ్వర్యంలో ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
పోలీస్ పాత్రలు కొంతవరకూ యంగ్ హీరోకి బాగానే కలిసొచ్చింది. రాక్షసుడు లో అలాంటి పాత్ర పోషించే సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అదే సెమంటిమెంట్ ఈసినిమాకి కూడా కలిసొస్తుందని భావిస్తున్నాడు. ఈ సినిమాగాక షైన్ స్క్రీన్ నిర్మాణంలోనూఓ సినిమాను మూన్ షైన్ పిక్చర్స్ సంస్థలోనూ మరో సినిమా కమిట్ అయినట్లు సమాచారం. దీంతో బెల్లంకొండ చేతిలో రెడీగా మూడు సినిమాలున్నట్లు తెలుస్తోంది. అయితే కమిట్ అయిన ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించేది? ఎవరు ? అన్నది ఇంత వరకూ కన్పమ్ కాలేదు.