సినిమా కి మంత్రి వార్నింగ్..రిలీజ్ డిసైడ్ చేసేది అయనేనా!
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉట్టేకర్ `ఛావా` చిత్రాన్ని తెరకెక్కిం చిన సంగతి తెలిసిందే.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉట్టేకర్ `ఛావా` చిత్రాన్ని తెరకెక్కిం చిన సంగతి తెలిసిందే. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్- ఆయన భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఈసినిమా రిలీజ్ కి ముందే వివాదాస్పదం అవుతుంది.
ట్రైలర్ లో శంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ డాన్స్ చేయడంపై మహరాష్ట్ర మంతి ఉదయ్ సావంత్ మండిపడ్డారు. ఆడాన్స్ సన్నివేశాన్ని తక్షణం తొలగించాలని డిమాండ్ చేసారు. `సినిమాలో శంభాజీ డాన్స్ చేసినట్లు చూపించారు .ఇది చాలా తప్పు. సినిమా రిలీజ్ కు ముందు చరిత్రకారులకు, స్కాలర్లకు సినిమా చూపించాలి. వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆయా సన్నివేశాలను తొలగించాలి.
ఆ తర్వాతే రిలీజ్ చేయాలి. శంభాజీ కథని తెరపైకి తీసుకురావడం అన్నది మంచి ప్రయత్నం. కానీ ఆయన కీర్తిని తక్కువ చేసి చూపిస్తే ఊరుకోం. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి ఎంతో గొప్పగా చూపించాలి. సినిమాపై ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చరిత్ర తెలిసిన వారికి సినిమా చూపించాలని అడిగాను. చరిత్రను అతిగా వక్రీకరించినా....ప్రతిష్ట దెబ్బ తినేలా ఉందంటే రిలీజ్ ను అడ్డుకుంటాం.
సినిమా చూసిన తర్వాతే రిలీజ్ పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని` తెలిపారు. దీంతో లక్ష్మణ్ ఉట్టేకర్ ముందు పెద్ద సవాల్ ఉంది. సినిమాతో ముందుగా ప్రభుత్వాన్ని మెప్పించాలి. ఆ తర్వాతే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు వ్యక్తమైతే ఆ సన్నివేశాలు తొలగించి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. చారీత్రక నేపథ్యం గల సినిమాలు రిలీజ్ సమయంలో ఇలాంటి అభ్యంతరాలు సహజమే. అయితే ఛత్రపతి విషయంలో మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా కనిపిస్తోంది.