ఒకప్పుడు ఆమె సుమ కంటే టాప్ యాంకర్.. విలన్ గా రీ ఎంట్రీ?
ఇదిలా ఉంటే ఈమె ప్రస్తుతం ఓ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సత్యరాజ్ లీడ్ రోజ్ లో 'బార్బరిక్' అనే మూవీ రెడీ అయ్యింది.
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్స్ అంటే అందరికి బాగా గుర్తుకొచ్చే వారు సుమ. ఆమె తరువాత ఝాన్సీ, అనసూయ. సుమ ఇప్పటికి స్టార్ యాంకర్ గా తన చరిష్మాని కొనసాగిస్తోంది. ఇక ఝాన్సీ బుల్లితెరకి స్వస్తి చెప్పి యాంకర్ గా సెటిల్ అయిపొయింది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. 'సలార్' సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో ఝాన్సీ కనిపించింది.
ఇక అనసూయ యాంకరింగ్ కి స్వస్తి చెప్పి చాలా తక్కువ టైం అయ్యింది. 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప 2' సినిమాల తర్వాత అనసూయ నటిగా ఫుల్ బిజీ అయిపొయింది. ప్రస్తుతం ఆమె ఫుల్ టైం యాక్టర్ గానే కొనసాగుతోంది. ఇక సీనియర్ యాంకర్ ఉదయభాను ఒకప్పుడు బుల్లితెరపై చక్రం తిప్పింది. తన అందం, మాటలతో అందరిని అలరించింది. మరల ఇప్పుడిప్పుడే కొన్ని షోలు చేస్తూ ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో పడింది.
నిజానికి ఉదయభాను నటిగానే కెరియర్ స్టార్ట్ చేసింది. ఆర్ నారాయణమూర్తి 'ఎర్ర సైన్యం' సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత హిందీలో పౌరాణిక సీరియల్ లో సీత పాత్రలో నటించింది. నెక్స్ట్ కొన్ని కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే ఏవీ ఆమెకి సక్సెస్ తీసుకురాలేదు. 'లీడర్', 'జులాయి' సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అలాగే 2013లో 'మధుమతి' అనే మూవీలో హీరోయిన్ గా ఉదయభాను చేసింది.
తరువాత చాలా కాలం బుల్లితెరకి, ఇటు నటనకి దూరమైంది. 2024 నారా రోహిత్ 'ప్రతినిధి 2' చిత్రంలో ఉదయభాను కనిపించింది. ఇదిలా ఉంటే ఈమె ప్రస్తుతం ఓ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సత్యరాజ్ లీడ్ రోజ్ లో 'బార్బరిక్' అనే మూవీ రెడీ అయ్యింది. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ మూవీలో ఉదయభాను విలన్ గా కనిపించబోతోందంట. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజ స్టైల్ లో అదిరిపోయే ట్విస్ట్ లతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ 'బార్బరీక్' మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఆమెకి నటిగా కమర్షియల్ బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ యాక్టర్ ని చేస్తుందేమో చూడాలి.
ఒక వేళ ఉదయభాను వెండితెరపై సక్సెస్ అయితే ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే దర్శకులు చాలా మంది ఉంటారు. అలాగే పెద్ద ప్రొడక్షన్స్ లలో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ఉదయభాను ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన విజయం అందుకుంటుందేమో చూడాలి.